సమాజంలో కొన్ని వృత్తులకు, వర్గాలకు కొన్ని డ్రెస్‌లు ఉంటాయి. వాటిని యూనిఫామ్ అని అంటారు. అయితే సినిమావాళ్లకు యూనిఫామ్ అంటూ ఏమీ ఉండదు. ఎవరుకు నచ్చిన డ్రెస్‌ల్లో వాళ్లు ఉంటారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం యూనిఫామ్‌లా ఒకే డ్రెస్ ధరిస్తుంటారు. ఒకరు టోపీ పెట్టుకుంటే, ఇంకొకరు తలకు క్లాత్ కట్టుకుంటారు. ఇలా ఎవరి లెక్క వారిది. ఇలాంటి ఓ అనధికార నియమమే కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు కూడా ఉంది. ఆయన శివైక్యం పొందిన నేపథ్యంలో ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నారు.
కె.విశ్వనాథ్ ఇప్పటి ఫొటోలు చూస్తే ఇంట్లో తాతగారు అనేలా ఉంటాయి. అయితే ఆయన దర్శకుడిగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న రోజుల్లో సెట్స్‌లో ఆయన ఖాకీ దుస్తుల్లోనే కనిపించేవారు. అలా ఎందుకు ఖాకీ ధరిస్తారు అనే విషయం గురించి ఓ సందర్భంలో కె.విశ్వనాథ్ స్వయంగా పంచుకున్నారు. ‘‘సెట్‌లో ఖాకీ యూనిఫామ్ వేసుకోవడం వెను చాలా పెద్ద కథ ఉంది. నేను సౌండ్ రికార్డిస్ట్‌గా ఉండి దర్శకుడ్ని అయినవాడ్ని’’ అంటూ తన పాత రోజులు గుర్తుచేశారు కె.విశ్వనాథ్.
‘‘మామూలుగా ఎమ్మెల్యే అయినవాడు తర్వాత మంత్రి అవ్వాలనుకుంటాడు. మంత్రి అయినవాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి కావాలని అనుకుంటాడు. సినిమాల్లోనూ అలానే ఉంటుంది. ఏ విభాగంలో అడుగుపెట్టినా లక్ష్యం దర్శకుడే. అలాంటి కుర్చీ నాకు దక్కితే కళ్లు నెత్తికెక్కే ప్రమాదం ఉంటుంఇ అనిపించింది. దాంతో ఈ ఆలోచన చేశాను. దర్శకుడు అయిపోగానే తెల్ల ప్యాంటూ, తెల్ల చొక్కా, తెల్ల బూట్లూ, మెళ్లో గొలుసులూ వేసుకుని హడావుడి చేయకూడదు అనిపించింది. నేనూ అందరిలానే మామూలు మనిషిలాగానే ఉండాలనుకున్నా’’ అని తన ఆలోచన గురించి వివరించారు.
‘‘అందుకే నా సినిమా సెట్లో పని చేసే లైట్‌బాయ్స్, హెల్పర్స్ ఇలా అందరికీ ఖాకీ దుస్తులే ఉంటాయి. కాకపోతే వాళ్లు నిక్కరు వేస్తారు. నేను ప్యాంటు వేస్తాను అంతే’’ అని చెప్పారు విశ్వనాథ్. ‘మీరు ఖాకీ డ్రస్సు వేసుకోవడం ఏంటండీ’ అని మా టీమ్‌లో కొందరు అడిగేవారు. వాళ్లకు ‘మొదటి సినిమా సరిగా ఆడకపోతే.. వెంటనే టాక్సీ డ్రైవర్ అయిపోతా. అప్పుడు కుట్టించుకోవడానికి వీలు ఉంటుందో లేదో.. అందుకే ఇప్పుడే రెడీ చేసి వేసేసుకుంటున్నా అని చెప్పేవాణ్ని’’ అని కె.విశ్వనాథ్ వివరించారు.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?