Sekhar Kammula, Mahesh Babu: కమ్ముల సినిమాపై మహేష్ రియాక్షన్!

శేఖర్ కమ్ముల సినినాలను కేవలం సినీ లవర్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ అగ్ర తారలు కూడా ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఆయన సినిమాల్లో ఒక మంచి ఫీలింగ్ ఉంటుందని మహేష్ బాబు చాలా సార్లు పాజిటివ్ గా కామెంట్ చేశారు. ఫిదా సినిమాలో మొదట ఆయానతోనే అనుకున్నప్పటికీ మహేష్ కమర్షియల్ అంశాలను దృష్టిలో ఉంచుకొని ధైర్యం చేయలేకపోయాడు. శేఖర్ కమ్ముల తో సినిమా అంటే మహేష్ ఇప్పటికీ ఒక ఆడియెన్ తరహాలో స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు.

భవిష్యత్తులో వీరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం లేకపోలేదు. తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు సూపర్ స్టార్ తో సినిమా చేస్తానని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇక టాలెంటెడ్ దర్శకులను ఎక్కువగా గౌరవించే మహేష్ బాబు మరోసారి శేఖర్ కమ్ముల సినిమాపై పాజిటివ్ గా కామెంట్ చేశారు. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. డ్యాన్స్ చుట్టూ తిరిగే ఈ సినిమా చూడడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. తప్పకుండా థియేటర్ లో చూడాల్సిన సినిమా అంటూ చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఇక లవ్ స్టోరీ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus