Sekhar Kammula, Dhanush: ఆ దర్శకుల బాటలో నడుస్తున్న కమ్ముల..?

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తొలి సినిమా నుంచి లవ్ స్టోరీ సినిమా వరకు తక్కువ బడ్జెట్ సినిమాలనే ఎక్కువగా తెరకెక్కించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. ఇప్పటివరకు చిన్న హీరోలతో, మిడిల్ రేంజ్ హీరోలతో సినిమాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల స్టార్ హీరో ధనుష్ తో ఒక సినిమా చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ధనుష్ స్టైల్ లో ఉంటుందా..? శేఖర్ కమ్ముల స్టైల్ లో ఉంటుందా..? అనే ప్రశ్నలు వినిపించగా శేఖర్ కమ్ముల పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

శేఖర్ కమ్ముల కొన్నేళ్ల క్రితం తెరకెక్కించిన లీడర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కి కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన కథతో ధనుష్ శేఖర్ కమ్ముల కాంబో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. తమిళనాడు రాజకీయ అనిశ్చితి గురించి శేఖర్ కమ్ముల ఈ సినిమాలో ప్రస్తావించనున్నారని సమాచారం. మరోవైపు శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం భారీ మొత్తం తీసుకోనున్నారని తెలుస్తోంది.

త్రిభాషా చిత్రం కావడంతో లవ్ స్టోరీ సినిమాకు తీసుకున్న మొత్తం కంటే ఎక్కువ మొత్తం ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల తీసుకుంటున్నారని సమాచారం. లవ్ స్టోరీ మూవీ రిలీజైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు తమ పారితోషికాలను భారీగా పెంచేయగా శేఖర్ కమ్ముల కూడా ఆ దర్శకుల దారిలో నడుస్తుండటం గమనార్హం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus