Sekhar Kammula: ఆ సీన్లను మార్చేసిన శేఖర్ కమ్ముల!

ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ మూవీ కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. వినాయక చవితి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటన వెలువడగా అదే రోజున టక్ జగదీష్, మ్యాస్ట్రో ఓటీటీలో రిలీజ్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. లవ్ స్టోరీ సెప్టెంబర్ 3వ తేదీ లేదా సెప్టెంబర్ 17వ తేదీ రిలీజ్ కావచ్చని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంపై మేకర్స్ స్పందించాల్సి ఉంది.

లవ్ స్టోరీ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా ఈ సినిమాలోని సారంగదరియా పాట బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల సినిమాలకు సున్నితమైన భావోద్వేగాలే బలం కాగా కొన్నిసార్లు శేఖర్ కమ్ముల సినిమాలకు నిడివి మైనస్ గా మారుతోంది. ప్రేక్షకులు సైతం నిడివి ఎక్కువగా ఉన్న సినిమాలను ఇష్టపడటం లేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ విషయంలో ప్రయోగాలు చేస్తున్నారని తెలుస్తోంది.

త్వరలో లవ్ స్టోరీ మూవీ సెన్సార్ జరగనుండగా సినిమాలో నిడివి ఎక్కువైన సీన్లలో శేఖర్ కమ్ముల మార్పులు చేస్తున్నారని సమాచారం. శేఖర్ కమ్ముల సినిమా డ్యూరేషన్ ను తగ్గించారని తెలుస్తోంది. ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఔట్ పుట్ కొరకు శేఖర్ కమ్ముల ఎంతో కష్టపడుతున్నారు. లవ్ స్టోరీ సినిమా గ్యారంటీగా సక్సెస్ సాధిస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus