Sekhar Master: కూతురు వీడియో షేర్ చేసి దీప్తిని ఛాలెంజ్ చేసిన శేఖర్ మాస్టర్!

‘లవ్ స్టోరీ’ సినిమాలో సారంగ దరియా సాంగ్ యూట్యూబ్ లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మిలియన్లలో వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో ఏ లిరికల్ సాంగ్ కి సాధ్యం కానీ రికార్డులను ఈ సాంగ్ దక్కించుకుంది. సుద్దాల అశోక్‌ తేజ రాసిన ఈ తెలంగాణ జానపదాన్ని.. సింగర్ మంగ్లీ పాడింది. ఈ పాటలో సాయిపల్లవి తన డాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. ఈ పాటను శేఖర్ మాస్టర్, ఆనీ మాస్టర్ కలిసి కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ గతంలో ఓ ఈవెంట్ లో స్టెప్పులేసింది. ఇప్పుడు మరోసారి ‘సారంగ దరియా’ పాటకు స్టెప్పులేసి రచ్చ చేసింది. ఈ వీడియోను షేర్ చేసిన శేఖర్ మాస్టర్ ప్రేక్షకులకు ఓ ఛాలెంజ్ విసిరారు. అదేంటంటే.. ‘డాన్స్ దరియా ఛాలెంజ్’.. ‘మీరు కూడా మీ వర్షన్‌లో డ్యాన్స్ దరియాను చేసి మాకు పంపించండి. బాగా చేసిన వారిలోంచి ఐదు గురికి ఆహా నుంచి స్మార్ట్ ఫోన్లు లభిస్తాయని’ శేఖర్ మాస్టర్ చెబుతూ.. దీప్తి సునయనకు ఈ ఛాలెంజ్ ను విసిరారు. మరి ఆమె వీడియో చేసి అప్లోడ్ చేస్తుందేమో చూడాలి!

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!


సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus