చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్ ఇష్యూ నడుస్తోంది. ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంతో అందరి దృష్టి దానిపైనే పడింది. ఈ విషయంలో ఇప్పటికే చాలా మంది పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సంప్రదింపులు జరిపారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలను వెంటబెట్టుకొని విజయవాడకు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి జగన్ తో చర్చల్లో పాల్గొన్నారు. టికెట్ రేట్ల గురించి వారం పదిరోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన జీవో వస్తుందని మెగాస్టార్ స్వయంగా ప్రకటించారు.
అయితే ఆ తర్వాత జరిగిన పేర్నినాని – మంచు ఫ్యామిలీ మీటింగ్, దాని గురించి చేసిన ట్వీట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంలో చాలా మంది మంచు ఫ్యామిలీను ట్రోల్ చేశారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ ఈ మీటింగ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏపీ సీఎంతో జరిగిన మీటింగ్ గురించి పాజిటివ్‌గా స్పందించారు నరేష్. అయితే అంతకన్నా ముందు ఫిల్మ్ చాంబర్ ఇప్పుడు ఓ వర్క్ షాప్‌ని కండక్ట్ చేయాలని కోరారు.
ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముందున్న సవాళ్లేంటి? అసలు ఇండస్ట్రీకి ఏం కావాలి? అసలున్న సమస్యలేంటి? వాటికి తగ్గ పరిష్కారాలేంటి? వంటి వివరాలతో వర్క్ షాప్ నిర్వహిస్తే బావుంటుందని అన్నారు. ఇలా చేయడం సినిమా ఇండస్ట్రీ యూనిటీకి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వాల ముందు, ప్రజల ముందు తెలుగు సినిమా పరిశ్రమ ఐక్యతకు గౌరవం దక్కుతుందని అన్నారు. మరి నరేష్ కోరికను ఫిల్మ్ ఛాంబర్ పట్టించుకుంటుందో లేదో చూడాలి!
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!