‘ఐలవ్’యు చెప్పాను అంటున్న అలనాటి హీరో!!!

టాలీవుడ్ లో ఎందరో అలనాటి హీరోలు కమీడియన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా ప్రస్తుతం చెలామణీ అయిపోతున్నారు. అయితే అదే క్రమంలో అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోల్లో మన రాజంద్ర ప్రసాద్ ఒకరు. ఆయన సినిమాలకు ధీటుగా మరో హీరో, కృష్ణ గారి తనయుడు నరేశ్ సైతం వరుస హిట్స్ తో దూసుకుపోయేవారు.

ఇదిలా ఉంటే తాజాగా 40ఏళ్ల సినీ జీవితాన్ని కంప్లీట్ చేసుకున్న నరేశ్ మాట్లాడుతూ…తన జీవితంలో జరిగిన ఒక సెన్సేషనల్ విషయాన్ని బయట పెట్టాడు. ఇంతకీ ఏంటి ఆ విషయం, అంటే మాత్రం ఈ మ్యాటర్ చదవాల్సిందే…వివరాల్ళోకి వెళితే…అతిలోక సుందరి శ్రీదేవికి అప్పట్లో నేను ఐ లవ్యూ చెప్పానని, ఆమె తనకన్నా వయసులో రెండేళ్లు పెద్దదని, చిన్నప్పుడు ఆమె తన పక్కింట్లోనే ఉండేదని, ఇద్దరం కలిసి ట్యూషన్ కు కూడా వెళ్లే వాళ్లమని, ఓ రోజు ఆమెకు ఐ లవ్ యూ చెప్పానని, దానికి ఆమె మా అమ్మతో చెబుతా అని అనడంతో ఆ తరువాత తనను చూడడమే మానేసానని చెబుతూనే, ఆ తరువాత ఆమె పెద్ద హీరోయిన్ గా మారిపోయినా, తాము కలసినప్పుడల్లా చాల్ ఫ్రీగా మాట్లాడేది అని, అంతేకాకుండా ఆ లవ్ ప్రపోసల్ మ్యాటర్ ను గుర్తు చేస్తూ ఉండేది అని తెలిపాడు నరేశ్. మొత్తానికి ఆ అందాల సుందరికి ఐ లవ్ యు చెప్పిని లిస్ట్ లో మన నరేశ్ కూడా ఉన్నాడని ఇప్పుడే తెలిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus