ఇటీవల జారిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక శివాజీ రాజా ప్యానల్ ఓడిపోవడం కూడా జరిగింది. ఇక ఎన్నికలు ముగిసిన అనంతరం శివాజీ రాజా ప్రెస్ మీట్ పెట్టారు. తనపై నరేష్ చేసిన వ్యాఖ్యలు నిజం కావని ఆ విషయాల్లో క్లారిటీ ఇవ్వడానికే ఈ విధంగా ప్రెస్ వచ్చానని తన ఆవేదన వ్యక్తం చేసాడు.
ఇక ఈ ప్రెస్ మీట్లో శివాజీ రాజా మాట్లాడుతూ… “నా గెలుపు కోసం శ్రీకాంత్, దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి చాలా కృషి చేశారు. ఇప్పుడు గెలిచిన వారిలో ఏ ఒక్కరు కూడా ‘మా’ మీటింగ్ లకి హాజరయ్యేవారు కాదు… వారి అటెండెన్స్ 20, 30 శాతం కూడా మించి లేదు. నరేష్ నన్ను చాలా చులకనగా చూసాడు. నేను శ్రీకాంత్, చిరంజీవి గారిని ఒప్పించి యూ.ఎస్ లో ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. మేము ఆ ఫండ్ కలెక్ట్ చేయడానికి చాలా కృషి చేసాం. నరేష్ సినిమాలున్నాయి రాలేనని చెప్పేవాడు.
నేను శ్రీకాంత్ ఎప్పుడూ తప్పు చేయలేదు… చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు… ఇప్పటి వరకు నాపై చేసిన కామెంట్స్ లో ఎటువంటి నిజం లేదు. మా అందరి అటెండెన్స్ 90, 80 శాతం ఉంటుంది… కావాలంటే చెక్ చేసుకోండి. ఇక ఈ ఎలక్షన్స్ లో నేను పాల్గొనాలని అనుకోలేదు… అరుణాచలం వెళ్ళిపోదామనుకున్న సమయంలో అందరూ ఉండమంటే ఎన్నికల్లో పోటీచేశాను. అదే విధంగా ఎన్నికల ముందు శ్రీకాంత్ – ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు కళ్ళ వెంట నీళ్ళు తెప్పిస్తున్నాయి.. నా గెలుపు కోసం వారు చాలా కృషి చేశారు” అంటూ శివాజీ రాజా తన బాధని వ్యక్తం చేసారు.