సీనియర్ హీరోయిన్ గౌతమి ఎమోషనల్ కామెంట్స్.. వైరల్..!

అవ్వడానికి వైజాగ్ అమ్మాయే అయినప్పటికీ.. టాలీవుడ్లో కంటే కోలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది గౌతమి. ‘దయామయుడు’ ‘గాంధీ నగర్ రెండో వీధిలో’ వంటి చిత్రాలతో తెలుగు తెరకు పరిచయమైన గౌతమి.. అటు తరువాత వెంకటేష్ తో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమాలో కూడా నటించింది. తెలుగులో ఈమెకు నాగార్జున వంటి పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ.. అదే టైంకి తమిళంలో కమల్ హాసన్, రజినీ కాంత్ వంటి బడా హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడంతో అటు వైపు మళ్ళింది. అక్కడ కూడా ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అయితే అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న కమల్ హాసన్ తో సహజీవనం చెయ్యడం మొదలుపెట్టడంతో ఈమె కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడం మొదలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలను బయటపెట్టి వార్తల్లో నిలిచింది. ఆమె మాట్లాడుతూ.. “అప్పట్లో నేను షూటింగ్ కు వెళ్తే నాతో పాటు మా అమ్మగారు కూడా వచ్చేవారు. ఆ టైములో నాకు బయటి ప్రపంచం గురించి తెలిసేది కాదు. అయితే అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత ప్రపంచం అంటే ఏంటో తెలిసొచ్చింది. ప్రధానంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు మభ్యపెట్టే విధంగా మాటలు చెప్పి మోసం చేస్తుంటారు.

అప్పట్లో కమల్ హాసన్ నాతో చనువుగా నడుచుకునేవారు. అప్పటికే ఆయనకి రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలిసినప్పటికీ.. ‘వారికి విడాకులు ఇచ్చానని’ చెప్పిన ఆయన మాటలను నమ్మి మోసపోయాను. సారిక గారిని కమల్ గారు వదిలేసిన తర్వాత వారి పిల్లలైన శృతి హాసన్,అక్షర హాసన్ లను సొంత పిల్లలుగా చూసాను. వాళ్ళు ఉండగా నాకు పిల్లలు అవసరం లేదని పిల్లల్ని కనలేదు. అయితే తరువాత నేను మోసపోయాను అని అర్ధమైంది” అంటూ ఈమె చెప్పుకొచ్చింది. కమల్ హాసన్ ఈమెను నమ్మించి మోసం చేసారని.. ఇప్పుడు మొత్తం కోల్పోయి ఒంటరిని అయ్యానని ఈమె ఆవేదన వ్యక్తం చేసింది. అలా ఈమె మరో సావిత్రిగా అయిపోయినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus