ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్ గా చేసిన రక్ష అందరికీ గుర్తుండే ఉంటుంది.’నచ్చావులే’, ‘మేం వయసుకు వచ్చాం’, ‘నిప్పు’ (Nippu), ‘నాగవల్లి'(Nagavalli) , ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి'(Brother of Bommali), ‘దువ్వాడ జగన్నాథం’ (Duvvada Jagannadham) వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. తర్వాత సీరియల్స్ లో కూడా నటించింది. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. రక్ష మాట్లాడుతూ… “గతంలో నేను ఐటెం సాంగ్స్ చేశాను.అప్పుడు నాకు నటిగా అవకాశాలు రావట్లేదు అని బాధపడింది లేదు.
కానీ ఇప్పుడు ఫీలవుతున్నాను. ఎందుకు అంటే అప్పుడు అలా చేయడం వల్ల ఇప్పుడు నాకు మదర్ క్యారెక్టర్స్ రావడం లేదు. నన్ను నమ్మి రవి బాబు (Ravi Babu) గారు ‘నచ్చావులే’ మూవీలో మంచి రోల్ ఇచ్చారు. వేరే వాళ్ళు నాకు మాత్రం ఎవరూ ఇలాంటి ఆఫర్ ఇవ్వరు. కానీ ఆయన పెద్ద సాహసం చేశారు అనే చెప్పాలి. నేను నటిగా చేస్తున్న టైంలోనే మదర్ క్యారెక్టర్ అనేసరికి కొంచెం ఆలోచించాను. కానీ రవి బాబు ‘మీరు చేస్తే బాగుంటుందని’ నన్ను నమ్మి ఎంకరేజ్ చేయడంతో సరే, నాకు కూడా పెళ్ళై, పిల్లలు ఉన్నారు కదా! అని మదర్ రోల్ చేశాను.
అలా ఫస్ట్ టైం మదర్ క్యారెక్టర్ చేయడం నాకు ఫస్ట్ టైం నంది అవార్డ్ రావడం ఆ పాత్ర వల్లే జరిగింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మదర్ క్యారెక్టర్స్ చేశాను. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. మధ్యలో ఒక తమిళ సినిమా కోసం నన్ను ఒక దర్శకుడు అడిగాడు. స్లీవ్ లెస్ వంటివి వేసుకుని నటించమంటే నా వల్ల కాదు అని ముందుగా చెప్పాను. కానీ తర్వాత షూటింగ్ కి వెళ్తే నాది బోల్డ్ రోల్ అని చెప్పాడు.
దీంతో అతని చెంప పై ఒకటి కొట్టి వచ్చేసాను. వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వాలని దర్శకులు బోయపాటి (Boyapati Srinu) అనుకున్నారట. కానీ మధ్యలో వేరే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఆ పాత్ర నాకు రాకుండా చేశారు. ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చారు.