Actress Sudha: వ్యభిచారానికి కూడా పనికిరావన్నారు.. సుధ షాకింగ్ కామెంట్స్!

  • February 5, 2022 / 09:19 AM IST

వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసి.. ఆ తరువాత దర్శకుడిగా కూడా చాలా సినిమాలకు వర్క్ చేశారు. దాదాపు 1200కి పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన ఆయన దాదాపు అందరి స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. అలానే ‘ఆట’ అనే డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరించారు. అయితే ఈ సీనియర్ కొరియోగ్రాఫర్ తనను ఘోరంగా అవమానించి.. తిట్టారంటూ సీనియర్ నటి సుధ వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ”తమిళంలో ఓ సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్ నాకొక డాన్స్ మూమెంట్ చెప్పారు.

Click Here To Watch

నాకు ఆ మూమెంట్ రావడం లేదు. నాలుగైదు టేక్ లు తీసుకున్న తరువాత.. ఛీ! నువ్ వ్యభిచారం చేయడానికి కూడా పనికి రావు అని జారీచేశారు. అందరిముందు అలా అనేసరికి నాకు ఏడుపు వచ్చేసింది. ప్రభుగారు.. పి. వాసు గారు.. ఇలా పెద్దపెద్ద వాళ్లంతా సెట్‌లో ఉన్నారు. అందరి ముందు నన్ను అంత పెద్ద మాట అనేసరికి తట్టుకోలేకపోయాను. ఏడుస్తూ సెట్‌లో నుంచి వెళ్లిపోయాను. చిన్న ఆర్టిస్ట్ అయినా.. పెద్ద ఆర్టిస్ట్ అయినా.. అలా అనడం తప్పు.

ఏడుస్తూ ఇంటికి వెళ్లి ఆయన సినిమాలో ఉంటే నేను చేయలేనని మా అమ్మతో చెప్పాను. కానీ మా అమ్మ నువ్ చేయాలని చెప్పింది. రేపు అతడు డైరెక్టర్ అయిన తరువాత నిన్ను అతడి సినిమాలో చేయమని అడుగుతారు అప్పుడు నీ నటనతోనే సమాధానం చెప్పాలని చెప్పింది. అమ్మ చెప్పినట్లుగానే ఆరేళ్ల తరువాత అతడు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో అమ్మ రోల్ కోసం నా దగ్గరకు వచ్చారు. ఆయన్ని చూడగానే సినిమా చేయనని మా అమ్మతో చెప్పాను.

కానీ అమ్మ నచ్చజెప్పి అతడు పశ్చాత్తాప పడుతున్నాడు కాబట్టే నీ దగ్గరకి వచ్చాడని చెప్పింది. ఆ తరువాత అగ్రిమెంట్ పై సైన్ చేశాను. షూటింగ్ వెళ్లినప్పుడు ఫస్ట్ షాట్ లోనే ఓకే చేశారు. రెండు పేజీల డైలాగ్ చాలా బాగా వచ్చిందని.. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తరువాత సుందరం మాస్టర్ నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పారు. ఆ సినిమాతో నాకు మంచి పేరొచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus