‘గోరింటాకు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సుజాత. 1952 డిసెంబర్ 10న జన్మించిన సంగతి తెలిసిందే. నిజానికి సుజాత తన 14వ ఏటనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే1974 సంవత్సరంలో కె.బాలచందర్ డైరెక్షన్లో ‘ అవ్వాలోరు తుధల్ కథై’ సినిమాతో హీరోయిన్ గా మారిన సుజాత… ఆ సినిమా హిట్టవ్వడంతో తమిళ స్టార్ హీరోలు ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, జెమిని గణేశణ్ వంటి వారితో కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు సుజాత.. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలందరితోనూ నటించి మెప్పించింది.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ,హిందీ భాషల్లో కలిపి మొత్తం 300కి పైగా సినిమాల్లో నటించింది. ఇదిలా ఉండగా.. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండగా.. ఇంటి యజమాని కొడుకు జయకర్‌తో ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకుంది సుజాత. వీరికి ఓ అమ్మాయి, అబ్బాయి సంతానం. అటు తరువాత ఈమె సినిమాలను బాగా తగ్గించేసింది.ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెళ్లిన ఈమె… అక్కడి వాతావరణం పడకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చేసిందట.ఈ క్రమంలో ఆమె మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.అయితే సుజాత తన పర్సనల్ లైఫ్ లో చాలా కష్టాలు పడిందట.
సుజాత భర్త జయకర్.. ఏ పనీ చెయ్యకుండా సోమరిపోతులా ఇంట్లోనే ఉంటూ ఆమెను నానా చిత్రహింసలు పెట్టేవాడట. సుజాత షూటింగ్లో పాల్గొని ఇంటికి ఇంటికి రాగానే ఏదో ఒక గొడవ పెట్టుకుని బెల్టుతో కొట్టేవాడట. అంతేకాదు షూటింగ్ జరిగే లొకేషన్లకు కూడా వచ్చి ఆమెని చితక్కొట్టేవాడట. దర్శక నిర్మాతలు.. సుజాతను కలిసి కథ వినిపించడానికి వస్తే.. వారి దగ్గర పారితోషికం లెక్కలు ఎక్కువ చెప్పి వారిని కూడా చిత్ర హింసలు పెట్టేవాడట. సినిమాల్లోనే కాకుండా.. నిజ జీవితంలో కూడా ఈమె కష్టాలు వర్ణనాతీతం అని ఈమె సన్నిహితులు తెలియజేసారు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేం