బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్ దర్శకుడు అంటే అనురాగ్ కశ్యప్ పేరే వినిపిస్తుంది. సొంత పరిశ్రమ గురించి ఆయన ఒక్కోసారి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలా రీసెంట్‌గా బాలీవుడ్‌కి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. దీంతో ఏమైందా అని షాక్‌లోకి వెళ్లిపోయారు ఆయన అభిమానులు, బాలీవుడ్ ప్రేక్షకులు. ఆ విషయమే తేలకపోతుంటే.. ఇప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో ఆ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాలో ఇటీవల జరిగిన మాస్టర్ క్లాస్‌లో అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) మాట్లాడాడరు. ప్రముఖ దర్శకుడు రాజమౌళిని (S. S. Rajamouli) చూసి ఇప్పుడు 10 మంది చీప్ కాపీ వెర్షన్ రాజమౌళిలు పుట్టుకొచ్చారు షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే వారంతా రాజమౌళిలు అవ్వలేరు. ఆయన్ని కాపీ చేయడానికి ప్రయత్నిస్తుంటారు కానీ వర్కవుట్ అవ్వదు. ఎందుకంటే రాజమౌళి ఒరిజినల్. కానీ ఆయన ఐడియాలు ఎక్కడి నుండి వస్తాయో ఆయనకే తెలుసు అని అన్నారు.
పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాలో ఈ ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది. చిరంజీవి (Chiranjeevi) ‘ప్రతిబంధ్’, రజనీకాంత్ (Rajinikanth) ‘ఫౌలాది ముక్కా’, నాగార్జున (Nagarjuna) ‘శివ’ (Siva) పాన్ ఇండియా సినిమాలే. కాబట్టి పాన్ ఇండియా కొత్త విషయమేమీ కాదు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా పేరుతో కొంతమంది సరైన సినిమా తీయడం లేదు. ఒకే తరహా కథలను తీసుకొస్తున్నారు అని చెప్పారు. అందుకే కొత్తగా సినిమాల్లోకి వద్దామనుకుంటున్న వాళ్లు కొత్తగా ఆలోచించాలని సూచించారు.
బాలీవుడ్‌లో దర్శకుడిగా పేరుపొందిన అనురాగ్ (Anurag Kashyap) ప్రస్తుతం దక్షిణాదిలో నటుడిగా రాణిస్తున్నారు. గతేడాది ‘మహారాజ’ (Maharaja) సినిమాలో ఆయన నటన ఆకట్టుకుంది. ప్రస్తుతం అడివి శేష్ (Adivi Sesh) ‘డెకాయిట్’లో నటిస్తున్నారు. ఈ క్రమంలో మరికొన్ని సౌత్ సినిమాల్లో నటించే అవకాశం ఉందని సమాచారం. అందు కోసమే ఆయన బాలీవుడ్ సినిమాలకు గుడ్ బై చెప్పేశారు అని అంటున్నారు.