సినిమా బడ్జెట్ అంటే.. మనకి సినిమాలో కనిపించే లొకేషన్లు, సెట్లకు, నటీ నటుల పారితోషికాలకే కాదు.. షూటింగ్ స్పాట్లో సినిమా కోసం పనిచేసే ప్రతీ వ్యక్తి భోజనానికి వారి వసతులకు కలిపే ఉంటుంది. ఇవన్నీ యూనిట్ డైరెక్టర్స్ చూసుకుంటూ ఉంటారు. అయితే హీరో, హీరోయిన్లకు అలాగే స్టార్ క్యాస్ట్ లకు అదనపు వసతులు కచ్చితంగా ఉండాల్సిందే. వీటికోసమే నిర్మాతకి తడిసి మోపుడవుతూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు కచ్చితంగా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అవుట్ డోర్ షూటింగ్ ఉందంటే.. ఇక మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే..
ఓ హీరోయిన్ స్నానానికి బిస్లరీ వాటర్ ను ఏర్పాటు చేసాడట ఓ నిర్మాత. కొంచెం డీప్ గా వెళ్తే.. సీనియర్ హీరోయిన్ శ్రీవిద్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ధర్మచక్రం’ ‘తాళి’ వంటి చిత్రాల్లో హీరోలకు తల్లిగా నటించింది. తెలుగులో 40కు పైనే సినిమాల్లో నటించింది.మొదట్లో ఈమె హీరోయిన్ కూడా.! ఒకప్పటి గాయని.. ఎం.ఎల్.వసంత కుమారి కూతురు. ఇదిలా ఉండగా.. ఈమె ఓ తెలుగు సినిమాలో నటిస్తున్న సమయంలో అవుట్ డోర్ షూటింగ్ నిమిత్తం రాజమండ్రి వెళ్లాల్సి వచ్చిందట. ఆ టైములో అన్ని వసతులు బాగానే ఉన్నప్పటికీ స్నానం మాత్రం గోదావరి నీళ్లతో చెయ్యాల్సి వచ్చిందట.
అప్పుడే వరదలు రావడంతో నీళ్లు బురదగా మారాయి. వాటిని ఎలాగో అల.. ఫిల్టర్ చేసి శ్రీవిద్య స్నానానికి పంపించారట చిత్ర యూనిట్ సభ్యులు. కానీ పూర్తిగా బురద పోలేదని.. ఆ నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తాయని.. కాబట్టి నేను వాటితో స్నానం చెయ్యను అని నిర్మాతను పిలిచి పేచీ పెట్టిందట.దాంతో నిర్మాత.. బిస్లరీ వాటర్ బాటిల్స్ తెప్పించి.. రెండు బకెట్లుగా నింపి.. ఈమె స్నానికని ఇప్పించాడట. అప్పట్లో బిస్లరీ బాటిల్ ధర 6 రూపాయలని తెలుస్తుంది.