Naresh: ఆత్మ రక్షణ కోసం లైసెన్స్ గన్ కావాలంటూ ఎస్పీని కలిసిన నరేష్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నరేష్ ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ప్రధాన పాత్రలో నటించడం మళ్ళీ పెళ్లి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదేవిధంగా కీలక పాత్రలలో నటించిన ఇంటింట రామాయణం, సామజవరగమన సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా పుట్టపర్తి ఎస్పీ మాధవ రెడ్డిని కలిసి తన ఆత్మ రక్షణ కోసం తనకు లైసెన్స్ గన్ కావాలి అంటూ తన అభ్యర్థనను తెలియజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నరేష్ ఇంటిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ దాడిలో భాగంగా ఆయన ఇంటి ముందు పార్కు చేసినటువంటి వాహనాలు ధ్వంసం అయ్యాయి.

ఇలా ఈ విషయం గురించి గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నరేష్ తాజాగా ఎస్పీ మాధవరెడ్డిని కలిసి ఆత్మరక్షణ కోసం తనకు లైసెన్స్ గన్ను కావాలి అంటూ అభ్యర్థించారు.అయితే ఈయనపై దుండగులు దాడి చేయడానికి కారణం తన మూడో భార్య రమ్య రఘుపతి అంటూ ఆరోపణలు కూడా చేశారు. గత కొంతకాలంగా నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి మధ్య పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.

మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్నటువంటి (Naresh) నరేష్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి రమ్యా రఘుపతి తీవ్రస్థాయిలో గొడవ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఇంటిపై రమ్య రఘుపతి దాడి చేయించి ఉంటుందన్న అనుమానాలను కూడా నరేష్ వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన ఆత్మ రక్షణ కోసం తనకు గన్ను కావాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus