Naresh: అరెస్టుపై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఈ అరెస్టు పట్ల ఎంతోమంది తీవ్రస్థాయిలో వ్యతిరేకత తెలుపుతున్నారు. ఇలా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు అరెస్టు కేవలం కక్ష సాధింపు చర్య అంటూ కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కావడంతో సినిమా సెలబ్రిటీలు ఏ కార్యక్రమానికి హాజరైనప్పటికీ విలేకరులు ఈ విషయం గురించి వారిని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో రవిబాబు అశ్వినీ దత్, మోహన్, నట్టి కుమార్ వంటి వారు స్పందించి ఈయనని అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య అని

ఈయన అరెస్టును వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలియజేశారు. ఇకపోతే సిని సెలబ్రిటీలు ఏదైనా కార్యక్రమానికి హాజరైనప్పటికీ చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి ప్రశ్నించడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు నరేష్ తాజాగా ఈయన ఆహా కోసం ఒక సిరీస్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ది గ్రేట్‌ ఇండియన్‌ సుసైడ్‌ అనే టైటిల్ పెట్టారు ఇక ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ ఆరవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేపట్టారు.

ఈ ప్రమోషన్లలో భాగంగా నరేష్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈయనని మీడియా ప్రశ్నిస్తూ చంద్రబాబునాయుడు అరెస్ట్‌ గురించి స్పందించమని అడిగారు. ఇలా మీడియా వారి నుంచి ఈ ప్రశ్న ఎదురు కావడంతో నరేష్ వెంటనే ఆయన తన టైటిల్‌ వున్న పోస్టర్‌ను చూపించి ది గ్రేట్‌ ఇండియన్‌ సుసైడ్‌ అని ముగించారు.

అయితే చంద్రబాబు గురించి మరొక ప్రశ్న వేయడంతో చాలా తెలివిగా (Naresh) నరేష్ సమాధానం చెబుతూ నేను చెప్పింది నా వెబ్‌సీరిస్‌ అంటూ తెలివిగా దాట వేశారు. నిజంగా ది గ్రేట్‌ ఇండియన్‌ సుసైడ్‌ చంద్రబాబుకా, జగన్‌ కా? అనేది డైలమాలో నరేష్ అందరిని పడేశారు అని చెప్పాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus