NTR, Balayya: బాలయ్య సినీ కెరీర్ గురించి ఎన్టీఆర్ అలా ఆలోచించారా?

స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా సంక్రాంతికి ప్రకటించిన కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకోవడంతో ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో యమగోల సినిమా కూడా ఒకటి.

యమగోల సినిమాలో హీరోగా మొదట బాలకృష్ణను ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమాకు డివి.నరసరాజు సంభాషణలు అందించడం గమనార్హం. యమగోల స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో నరసరాజు ఈ సినిమాలో హీరోగా బాలకృష్ణ, యముడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని సూచనలు చేశారు. యమగోల కథ విని ఓకే చెప్పిన ఎన్టీఆర్ తండ్రీ కొడుకు కాంబినేషన్ లో ఈ సినిమాను తెరకెక్కించడానికి మాత్రం అంగీకారం వ్యక్తం చేయలేదు.

ప్రస్తుతం బాలకృష్ణ చదువుకుంటున్నాడని బాలయ్యను సొంత సినిమాలకు మాత్రమే పరిమితం చేస్తున్నామని ఎన్టీఆర్ చెప్పడంతో బాలయ్య ఈ సినిమాలో నటించలేదు. బాలయ్య ఈ సినిమాలో నటించినా ఈ సినిమా అదే ఫలితాన్ని అందుకుని ఉండేది. బాలయ్య బయటి సినిమాలలో నటించడం గురించి ఆలోచించడం లేదని ఎన్టీఆర్ పేర్కొన్నారు. బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా బాలయ్య సినిమాలన్నీ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.

బాలయ్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. బాలయ్యకు జోడీగా నటించడానికి స్టార్ హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో బాలయ్య కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం. బాలయ్య సినిమాల బడ్జెట్ అంతకంతకూ పెరుగుతోంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus