Senior Actor: తన కూతురి పై సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు!

స్టార్ కిడ్స్ కి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఈజీనే కానీ.. ఇక్కడ నిలబడాలి అంటే టాలెంట్ అలాగే ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. లేదంటే చాలా కష్టమనే చెప్పాలి. అయితే స్టార్ కిడ్స్ కి కొన్ని అడ్వాంటేజ్ లు ఉంటాయి. అబ్బాయిలు అయినా, అమ్మాయిలు అయినా ఎంట్రీ చాలా సింపుల్. అలాగే అమ్మాయిలకి అయితే క్యాస్టింగ్ కౌచ్ వంటి ఇబ్బందులు ఉండవు. ఇవి చాలా మంది చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం.

బాలీవుడ్ (Senior Actor) సీనియర్ నటుడు అయిన సంజయ్ కపూర్.. తన కూతురు షనయ కపూర్ ని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన కూతురు తెలివితేటలని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించాడు. షనయ స్టార్ కిడ్ గానే సినిమాల్లోకి వచ్చింది. కానీ ఆమె తన తండ్రి బ్యాక్ గ్రౌండ్ ను ఎక్కువగా వాడదు. అందుకే ఆమెలో ప్రత్యేకతలున్నాయి అని, పరిశ్రమలో ఎదురయ్యే కష్టాలపై ఆమెకు పూర్తి అవగాహన ఉందని సంజయ్ చెప్పాడు.

‘సినీ పరిశ్రమలో ఎదురయ్యే ఒడిదొడుకుల గురించి నా కూతురికి బాగా తెలుసు.అన్ని విషయాల్లో ఆమెకు పూర్తి అవగాహన ఉంది. ఈ విషయంలో మేము ఆమె పై ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ, దృష్టి పెట్టనవసరం లేదు. ఎందుకంటే నా సినీ కెరీర్ ను ఆమె చాలా దగ్గరి నుండి చూసింది. నేను ఎలా నడుచుకున్నానో, ఎలా పనిచేశానో ఆమె బాగా గమనించింది.

ఇంతకంటే గొప్ప పాఠం ఏమీ ఉండదు కదా. ఇలాంటి పాటలను స్టార్ కిడ్స్ అందరూ నేర్చుకోవాలి. లేకపోతే ఎంత గైడన్స్ ఇచ్చినా ప్రయోజనం ఏముంటుంది. ఈ ఫీల్డ్ లోకి వచ్చేవాళ్లకు కమిట్మెంట్ ఉండాలి’ అంటూ సంజయ్ చెప్పుకొచ్చాడు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus