ఆ దూకుడు చూపించాలని సీనియర్ స్టార్స్ అనుకోవడం లేదా?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి. ఈ సీనియర్ హీరోల వయస్సు 60 సంవత్సరాలు దాటినా ఈ హీరోలకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ హీరోలకు యూత్ లో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏడాదికి ఒక సినిమా అయినా రిలీజయ్యేలా ఈ సీనియర్ హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ హీరోలు ఇతర భాషల్లో తమ సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు.

ఒకవేళ ఇతర భాషల్లో సినిమాలను విడుదల చేసినా ఆ సినిమాల ఇతర భాషల ప్రమోషన్స్ లో పాల్గొనడానికి హీరోలు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పాన్ ఇండియా సినిమాల ద్వారా దూకుడు చూపించాలని సీనియర్ స్టార్స్ భావించడం లేదు. చాలా విషయాలలో యంగ్ జనరేషన్ హీరోలకు పోటీనిస్తున్న సీనియర్ స్టార్స్ ఈ విషయంలో మాత్రం పోటీనివ్వడం లేదు. మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా కొన్ని నెలల గ్యాప్ లోనే చిరంజీవి సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

అక్టోబర్ లో గాడ్ ఫాదర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి సంక్రాంతి పండుగ సమయంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలయ్య ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. నాగార్జున ప్రస్తుతం సినిమాల షూటింగ్ లకు సంబంధించి బ్రేక్ తీసుకున్నా బుల్లితెర షో బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకటేష్ నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వయస్సు పెరుగుతున్నా సీనియర్ హీరోలు మాత్రం రెస్ట్ తీసుకోకుండా వరుస ఆఫర్లతో బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus