Nayanthara: నయన తార పై సీనియర్ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు..!

ప్రముఖ కోలీవుడ్ సీనియర్ నటుడు మరియు రాజకీయ నేత అయిన రాధా రవి.. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుంటాడు. సంబంధం లేకుండా కొంతమంది సెలబ్రిటీలను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్లు చెయ్యడం ఈయన నైజమని చెప్పాలి. ఇటీవల ఈయన స్టార్ హీరోయిన్ నయన తార పై చేసిన కామెంట్లు పెద్ద చర్చకు దారితీసాయి.వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈయన బీజేపీ తరఫున ఓ సభలో మాట్లాడుతూ… నయనతార పై ఘోరమైన కామెంట్లు చేసాడు.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నయనతారకు, ఉదయనిధి స్టాలిన్‌కు మధ్య అక్రమ సంబంధం ఉంది అని గతంలో రాధా రవి కామెంట్లు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.వీటి పై రాధారవి స్పందిస్తూ.. ‘నయనతార, ఉదయనిధి మధ్య లింక్ ఉంటే నాకేంటి సంబంధం. ఆ విషయం పై నాకు ఎలాంటి పట్టింపు లేదు’ అంటూ చెబుతూనే మరో పక్క డి.ఎం.కె పార్టీ యువ నేత ఉదయనిధి స్టాలిన్‌ పై విమర్శలు గుప్పించాడు. అంతేకాకుండా..’నన్ను పార్టీ నుండీ బహిష్కరించానికి నయనతార ఎవరు.. వాళ్లెవరు? అవసరమైతే ఇప్పుడున్న పార్టీ నుండీ బయటకు వెళ్లి మరో పార్టీలో చేరుతున్నారు’ అంటూ తెగించి మాట్లాడాడు రాధారవి.

ఇక ఈయన చేసిన వ్యాఖ్యలకి నయన్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగర్ చిన్మయి కూడా రాధా రవి పై మండిపడుతూ ట్వీట్ చేసింది. ‘ఈయన(రాధా రవి) ప్రవర్తన, మాట తీరు చాలా అసభ్యకరంగా ఉంటాయి. ఈయన మాటలు వినీ వినీ విసిగిపోయాను. ఈయన బహిరంగంగానే బూతులు మాట్లాడుతుంటాడు. మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుంటాడు. ఇటువంటి వ్యక్తిని స్టార్ క్యాంపెయినర్‌గా పెట్టుకున్నందుకు ఆ పార్టీ వాళ్ళను అనాలి. డీఎంకే పార్టీ నేత ఏ రాజా అలాగే రాధా రవి లాంటి వాళ్లు బూతులు మాట్లాడటంలో సిద్దహస్తులు. ఇలాంటి వాళ్లకు ఓట్లు వేసి పవర్ ఇవ్వొద్దు’ అంటూ పేర్కొంది.


Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus