Jaya Prada: హీరోయిన్లే కమిట్మెంట్లు ఇస్తున్నారు… జయప్రద కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ శోభన్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నటువంటి వారిలో సీనియర్ నటి జయప్రద ఒకరు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ఈమెతో పాటుగా చేసినటువంటి హీరోయిన్స్ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ జయప్రద మాత్రం ఇండస్ట్రీలోకి రాలేదు.ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి జయప్రద ప్రస్తుతం రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇలా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉండే జయప్రద (Jaya Prada) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ముంబై హీరోయిన్లను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో మనం ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ పేరును వింటున్నాము. అవకాశాల కోసం ఎంతోమంది తమని కమిట్మెంట్స్ అడిగారు అంటూ పలువురు హీరోయిన్స్ బహిరంగంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు.

ఇలా తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమే అంటూ ఎంతోమంది ఈ విషయం గురించి తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కాస్టింగ్ కౌచ్ గురించి ఈ సందర్భంగా జయప్రద మాట్లాడారు. మా రోజుల్లో ఈ పదం మేము వినే వాళ్ళమే కాదు అంటూ ఈమె తెలిపారు.అవకాశాల కోసం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పనిలేదు మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయని ఈమె తెలిపారు. ప్రస్తుత కాలంలో దర్శక నిర్మాతలు ఎవరు కూడా కమిట్మెంట్స్ అడగడం లేదు.

స్వయంగా హీరోయిన్స్ దర్శకనిర్మాతులను కమిట్మెంట్ అడుగుతున్నారని ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.ముంబై నుంచి ఎంతోమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. వారు అవకాశాల కోసం ఇలా కమిట్మెంట్స్ అడుగుతున్నారు అంటూ ఈ సందర్భంగా జయప్రద కాస్టింగ్ కౌచ్ గురించి ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus