సౌత్ ఇండియాలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో మణిరత్నం ఒకరు. నాలుగు దశాబ్దాల క్రితం దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన వెండితెరాయ్ ఎన్నో అద్భుతమైన కథలను ఆవిష్కరించారు. ‘రోజా’, ‘బొంబాయి’, ‘దళపతి’ ఇలా ఎన్నో హిట్టు సినిమాలను తెరకెక్కించారు. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకుడు’ సినిమా ఒక క్లాసిక్ అనే చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1987లో ఈ సినిమాలో విడుదలైంది.
ఆ తరువాత కమల్, మణిరత్నం కలిసి సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. 37 ఏళ్ల తరువాత ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారని తెలియగానే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా కోసం మణిరత్నం.. ఏడుగురు పాన్ ఇండియా స్టార్స్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో క్రేజ్ ఉన్న తారలను ఈ సినిమాలో ఎంపిక చేయబోతున్నారు.
కమల్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. మమ్ముట్టి, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ కీలకపాత్రల్లో కనిపిస్తారట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఈ సినిమాకి ఏఆర్రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. మణిరత్నం, కమల్ హాసన్ లు కలిసి ఈ సినిమాను తమ సొంత బ్యానర్ లు మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్స్ లో రూపొందించనున్నారు.
అలానే ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను సమర్పించబోతున్నారు. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా రెండో భాగాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆ తరువాత కమల్ హాసన్ సినిమాకి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?