Fashion Sequel: గ్లోబల్‌ స్టార్‌ అవార్డుల సినిమాకు… 16 ఏళ్లకు సీక్వెల్‌ ఆలోచన.!

సినిమా రాగానే వెంటనే దానికి సీక్వెల్‌ సిద్ధం చేసేయాలి అనుకుంటున్న రోజులివి. అయితే వెంటనే సినిమా అయిపోతుందా, రిలీజ్‌ అయిపోతుందా అంటే లేదనే చెప్పాలి. అయితే సినిమా విడుదలై 16 ఏళ్లు దాటిన తర్వాత ఇప్పుడు సీక్వెల్‌కు ప్లాన్స్ వేస్తున్నారు. అయితే అదేదో సాధారణ విజయం సాధించిన సినిమా అనుకునేరు. ఆ రోజుల్లో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న సినిమా ఇది. హీరోయినన్లను స్టార్‌ హీరోయిన్లుగా మార్చిన సినిమా అది. ఓ మనిషి ఫ్యాషన్‌ రంగంలో సూపర్‌ మోడల్‌గా ఎదగాలంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో చెబుతూ 16 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది.

ఆ సినిమానే ‘ఫ్యాషన్‌’. ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మధుర్‌ భండార్కర్‌ తెరకెక్కించారు. 2008లో వచ్చిన ఈ సినిమాను అంత ఈజీగా మరచిపోరు ఎవ్వరూ. ఎందుకంటే కొన్ని చీకటి కోణాలు కూడా ఆ సినిమాతో బయటకు వచ్చాయి. అందుకే ఆ సినిమాలో నటనకుగానూ ఉత్తమ నటిగా ప్రియాంక చోప్రా, ఉత్తమ సహాయ నటిగా కంగనా రనౌత్‌ జాతీయ పురస్కరాలను అందుకున్నారు.

ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ ఆలోచనలు చేస్తున్నారట. దర్శకుడు మధుర్‌ భండార్కర్‌ ఈ సీక్వెల్‌ కోసం కథ సిద్ధం చేస్తున్నారట. ఫ్యాషన్‌ రంగంలో ఇప్పుడు వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటి ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కిస్తారట. 16 ఏళ్ల క్రితమే ఈ సినిమా ఓ సంచలనం. అందాల వెలుగు వెనుక ఇంత చీకటి ఉందా అని అందరూ ముక్కున వేలేసుకున్నారు.

అలాంటిది ఇప్పుడు ఆ పరిశ్రమలో ఇష్యూస్‌ని బయటకు చూపించే సినిమా అంటే ఎంత చర్చకు దారి తీస్తాయో చూడాలి. అలాగే ఈ సినిమాలో ఎవరు నటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆ సినిమాతో ఇండస్ట్రీకి స్టార్‌ హీరోయిన్లుగా మారిపోయారు ప్రియాంక, కంగన. ఇప్పుడు ఈ సినిమాతో అలాంటి ఫీట్‌ సాధించే ఆ నాయికలు ఎవరు అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus