NTR, Ram Charan: తారక్‌ – చరణ్‌ – జక్కన్న సినిమా ఇంకో పార్టు ఉందా?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సీక్వెలా? ఛ… ఊరుకోండి ఇంకా తొలి పార్టే రాలేదు. రెండో పార్టు ముచ్చటా ఎక్కడా లేదు అంటారా. అవును మీరు చెప్పింది నిజమే కావొచ్చు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి పార్ట్‌ 2 ఉంది అనే పుకారు మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. సోమవారం సాయంత్రానికి ‘ఆర్‌ఆర్ఆర్‌’ కొత్త రిలీజ్‌ డేట్ ఇచ్చారు కానీ… అంతకుముందు అంతా సీక్వెల్‌ ముచ్చట్లే వినిపించాయి. అవును ‘ఆర్‌ఆర్ఆర్‌’కి సీక్వెల్‌ తీసే ఆలోచనలో అయితే ఉన్నారట. కానీ సినిమాగా కాదట.

అవును ‘బాహుబలి’ రెండు పార్టుల తర్వాత మూడో పార్టు ప్లాన్‌ చేశారు గుర్తుందా? అయితే మూడో పార్టు పూర్తవ్వలేదు, విడుదలవ్వలేదు అనుకోండి. అచ్చంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలోనూ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారట రచయిత విజయేంద్ర ప్రసాద్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ముగిసిన సందర్భంగా నుండి కథను కొనసాగిస్తూ వెబ్‌ సిరీస్‌ రూపొందించాలని చూస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ… ఈ ఆలోచన అయితే ఆయనకు ఉందని సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్‌ చేస్తే ఎవరు నటిస్తారు, ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే విషయంలో క్లారిటీ అయితే లేదు కానీ…

ఒకవేళ సీక్వెల్‌ వస్తే ఎలా ఉండొచ్చు అనే అంశం మీద మాత్రం కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ పాత్రల నేపథ్యంలో ఈ సీక్వెల్‌ ఉంటుందట. అయితే దీనిని వెబ్‌ సిరీస్‌గా తీస్తారా? లేక వెబ్‌ ఫిల్మ్‌గా తీస్తారా అనేది తెలియదట. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్‌ ఈ ఆలోచన అయితే చేశారట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ తర్వాత దీనిపై క్లారిటీ వస్తుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి, కొమురం భీమ్‌ కలసి ఒక సంవత్సరం ఉమ్మడిగా తెల్లవారిపై పోరాడతారు.

దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు శుభం కార్డు పడిపోతుందట. ఆ తర్వాత ఎవరికి వారు సొంత ప్రాంతాలకు వెళ్లి ఉమ్మడిగా పోరాడతారు. దానినే సీక్వెల్‌లో చూపించాలని విజయేంద్ర ప్రసాద్‌ అనుకుంటున్నారట. దానికి తగ్గట్టుగా ప్రస్తుతం ఆలోచనలు చేస్తున్నారట. ‘ఆర్‌ఆర్ఆర్‌’ ప్రచారం రీస్టార్ట్‌ చేసినప్పుడు దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus