పెళ్లి కళ వచ్చేసిందంటూ తెగ సిగ్గు పడిపోతున్న నటి శోభ శెట్టి.. వైరల్ అవుతున్న వీడియో!

బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమెను శోభా శెట్టి అనడం కన్నా మోనిత అంటేనే అభిమానులు టక్కున ఈమెను గుర్తుపడతారు.కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శోభా శెట్టి తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈమె పలు బుల్లి తెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సీరియల్ కు సంబంధించిన విషయాలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన పెళ్లి చూపులు అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. శోభ శెట్టి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోని షేర్ చేస్తూ ప్రతి ఏడాది నా పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగేది అయితే

ఈ పుట్టినరోజు సందర్భంగా మా అమ్మ నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది అంటూ పెళ్లి చూపుల గురించి చెప్పకు వచ్చారు.ఇలా ఆ అబ్బాయి ఎవరో ఏంటో తెలియకుండానే పెళ్లి అనగానే నాకు పెళ్లి కళ వచ్చేసింది అంటూ తెగ సిగ్గు పడిపోయింది. ఈ విధంగా శోభా శెట్టి తన పెళ్లి చూపుల గురించి ఈ వీడియోని షేర్ చేయడమే కాకుండా ఇల్లు మొత్తం డెకరేషన్ చేసి,

ఇంటి ముందు టెంట్ వేసి పెళ్లి చూపులకు వచ్చిన వారికి విందు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. ఇలా పెళ్లి గురించి శోభా శెట్టి తెలియజేస్తూ షేర్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus