సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ఇది ఒక మైథలాజికల్ అంశాలతో కూడిన చారిత్రాత్మక చిత్రం. చాలా మందికి ఈ చిత్రం కథ తెలిసే ఉండొచ్చు. శకుంతల – దుష్యంతుడు కథ ఇది. నిజానికి ఆ కథను సినిమాగా చూపించాలంటే 4 గంటల టైం పడుతుందట. కానీ ఈ చిత్రం రన్ టైం కేవలం 2 గంటల 19 నిమిషాలు మాత్రమేనని నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు చెప్పారు.
ఇంత తక్కువ టైంలో శకుంతల – దుష్యంతుల కథను అందంగా, అద్భుతంగా చూపించబోతున్నాడట దర్శకుడు గుణశేఖర్. నిజానికి ఈ చిత్రం షూటింగ్ 2022 నవంబర్లోనే కంప్లీట్ అయ్యింది. మొదట 2D మూవీగానే తీశారు. అయితే హర్షిత్, శిరీష్, దిల్ రాజు ల ప్రోత్సాహంతో ‘శాకుంతలం’ చిత్రాన్ని 3D కి మార్చారని దర్శకుడు గుణశేఖర్ చెప్పాడు. ఇక ఈ చిత్రానికి బడ్జెట్ రూ.70 కోట్ల వరకు అయ్యింది అని అంతా చెప్పుకుంటున్నారు.
సమంత సినిమా అంత పెద్ద మొత్తం రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆ బడ్జెట్ లెక్కలు నిజమే అని అంతా అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఆంత బడ్జెట్ అవ్వలేదు అని ఇన్సైడ్ టాక్. వాస్తవానికి ఈ చిత్రాన్ని రూ.24 కోట్ల బడ్జెట్ లోనే కంప్లీట్ చేశారట. మొత్తం గ్రీన్ మ్యాట్ లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట.
చివర్లో వి.ఎఫ్.ఎక్స్ కు రూ.6 కోట్ల ఖర్చు చేశారట. మొత్తంగా శాకుంతలం సినిమాకి పెట్టింది రూ.30 కోట్ల బడ్జెట్ అని తెలుస్తుంది. కానీ బిజినెస్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు అని సమాచారం.సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే రిటర్న్స్ వస్తాయి. లేదంటే కష్టమే. ఏప్రిల్ 14 న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!