Shaakuntalam OTT: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సమంత ‘శాకుంతలం’

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు అంటే ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. ఇప్పటి జనరేషన్ ను ఆకట్టుకునేలా ఈ చిత్రం అలాగే ఇందులోని పాత్రలు ఉంటాయని టీం మొదటి నుండి ఎంతో ధీమాగా చెప్పుకొచ్చింది.

కానీ ‘శాకుంతలం’ సినిమా చూస్తున్నంత సేపు అలాంటి కనెక్టివిటీ కుదిరినట్టు అనిపించదు. బోరింగ్ సన్నివేశాలు, కార్టూన్ సినిమాలను తలపించిన విఎఫెక్స్.. అర్థం కాని సంభాషణలు కలగలిపి ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చేలా చేశాయని చెప్పొచ్చు. ఇలాంటి మిక్స్డ్ టాక్ తో జనాలు ‘శాకుంతలం’ చిత్రాన్ని చూస్తారా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఈసారి సమంత ఫ్యాన్ బేస్ కూడా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాన్ని గట్టెక్కించే అవకాశాలు కనిపించడం లేదు.

కాబట్టి ఇప్పుడు చాలా మంది ఆలోచన ఒక్కటే? ‘ ‘శాకుంతలం’ (Shaakuntalam) ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఏ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది’ అని చర్చించుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ‘శాకుంతలం’ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

సమంత, దిల్ రాజు ల కారణంగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడైనట్టు సమాచారం. ‘శాకుంతలం’ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత అంటే మే మొదటి వారంలో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని స్పష్టమవుతుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags