Shaakuntalam: దిల్‌ రాజు మళ్లీ వెనకడుగు.. ఈసారి భారీ ప్లాన్‌తో..!

2023లో దిల్‌ రాజుకు అంతా వాయిదాల కాలమేనా? ఇదేంటి అంటారా? ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత తీసుకొస్తామన్న ‘వారసుడు’ వాయిదా పడింది. ఇప్పుడు మరో సినిమా అదే దారిలో నడుస్తోంది అంటున్నారు. అవును దిల్‌ రాజు ప్రొడక్షన్‌ నుండి వస్తున్న మరో సినిమా కూడా వాయిదా పడుతోంది అనే టాక్‌ వినిపిస్తోంది. అదే ‘శాకుంతలం’. గుణశేఖర్‌ – సమంత కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేయాలని అనుకున్నారు.

ఈ మేరకు ప్రచారం కూడా స్టార్ట్‌ చేశారు. ఇంటర్వ్యూలు, ప్రెస్‌ మీట్‌లు, పాటలు లాంచ్‌ అయ్యాయి, అవుతున్నాయి కూడా. అయితే మరోవైపు ఈ సినిమా వాయిదా పడుతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా వచ్చాయో తెలియదు కానీ.. వాయిదా పుకార్లు అయితే భారీగా షికార్లు చేస్తున్నాయి. దీనికి కారణం ఓ బాలీవుడ్‌ సినిమా అని అంటున్నారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా రీమేక్‌ ‘షెజాదా’ను వాయిదా వేశారు.

‘పఠాన్‌’ వేడిలో ఇబ్బందిపడకుండా టీమ్‌ ఫిబ్రవరి 10 నుండి 17కు వెళ్లిపోయింది. దీంతోనే అసలు సమస్య అంటున్నారు. ‘శాకుంతలం’ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు హిందీ నాట ఇబ్బంది రాకుండా… సమంత సినిమాను వెనక్కి నడిపిస్తున్నారట. దానికితోడు ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్స్‌కు ఇప్పుడున్న స్పీడ్‌ చాలదు. అలాగే సమంత అందుబాటులో లేదు. సమంత లేకుండా సినిమాను ప్రచారం చేసుకుంటే…

సరైన స్పందన రాదు అనేది టీమ్‌ ఆలోచన. అందుకే ఇంకాస్త సమయం తీసుకుంటే ‘శాకుంతలం’ సినిమాకు ప్రచారం బాగా చేయొచ్చు అని అనుకుంటున్నారట. అందుకే ఇప్పుడు వాయిదా వేసి.. మరో డేట్‌ కావాలి అనుకుంటున్నారట. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. ఇంకా ఆగడం మంచిది కాదనే మాట కూడా వినిపిస్తోంది. మరి దిల్‌ రాజు ఫైనల్‌గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది అంటున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus