Shah Rukh, Salman: ఫ్యాన్స్‌కు ఆనందాన్నిచ్చిన ఇద్దరు ఖాన్‌లు.. వీడియోలు వైరల్‌!

పుట్టిన రోజులు, పర్వదినాల్లో స్టార్‌ హీరోలను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున ఆ హీరోల ఇంటి దగ్గరకు చేరుకుంటూ ఉంటారు. వారి కోసం ఆ కథానాయకులు బయటకు వచ్చి మరీ విష్‌ చేస్తారు. ఈ మొత్తం సన్నివేశం చూడటానికి మనకు ఏదో సినిమా షూటింగ్‌లా అనిపిస్తుంది కానీ.. ఆ వీడియోలు చూస్తే అభిమానం అంటే ఇదీ అని అనాలని అనిపిస్తుంటుంది. ఇలాంటి సీన్స్‌ ముంబయిలో ఏటా మూడు సార్లు కనిపిస్తాయి. అందులో ఓసారి నిన్న.

అవును, ఎప్పటిలానే రంజాన్‌ సందర్భంగా తమ అభిమాన హీరోలు షారుఖ్‌ ఖాన్‌(Shah Rukh Khan) , సల్మాన్‌ ఖాన్‌ను (Salman Khan) చూడటానికి, విష్‌ చేయడానికి పెద్ద ఎత్తున అభిమానులు వాళ్ల ఇళ్ల దగ్గరకు చేరారు. వేల సంఖ్యలో వచ్చిన అభిమానులను విష్‌ చేయడానికి ఆ ఇద్దరు హీరోలు బయటకు వచ్చి సందడి చేశారు. వాటికి సంబంధించిన వీడియోలను ఆ హీరోలే సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.

ఉదయం పూట షారుఖ్‌ తన ఇల్లు ‘మన్నత్‌’ బాల్కనీ నుండి అభిమానులకు శుభాకాంక్షలు చేశారు. తనదైన శైలిలో ట్రేడ్‌ మార్క్‌ పోజులు ఇస్తూ సందడి చేశాడు. ఇక సల్మాన్‌ ఖాన్‌ రాత్రి పూట శుభకాంక్షలు చెప్పారు. సెల్‌ఫోన్‌ లైట్స్‌ వెలుగుల్లో సల్మాన్‌ ఇంటి ముందు సందడి వాతావరణం నెలకొంది. ఈ ఇద్దరు హీరోల అభిమానుల సందడి వీడియోలకు సోషల్‌ మీడియాలో భలే స్పందన వస్తోంది.

ఇక వీరి సినిమాల గురించి చూస్తే… షారుఖ్‌ ఖాన్‌ గతేడాది ‘జవాన్‌’ (Jawan) , ‘పఠాన్‌’ అంటూ రెండూ రూ. వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చాడు. ఇక సల్మాన్‌ ఖాన్‌ అయితే ఇంకా తిరిగి పూర్వపు ట్రాక్‌ ఎక్కలేదు. ‘పఠాన్‌’లో కాసేపు మెరిసినా సోలో విజయం రాలేదు. దీంతో ఈ ఏడాది కొత్త సినిమాలు ఓకే చేసే పనిలో ఉన్నాడు. మురుగదాస్‌ సినిమా ఒకటి ఫైనల్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus