Shah Rukh Khan: షారుక్ చేసే రాజకీయాలు నాకు నచ్చవు!

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన త్వరలోనే ది వాక్సిన్ వార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో వివేక్ అగ్నిహోత్రి పలువురు సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్ రాత్రంతా ఫుల్లుగా తాగి మరుసటి రోజు దేవుడు అంటే ఎవరు నమ్మరు

అంటూ ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి ఈయన రణవీర్ సింగ్ నా కాళ్లు పట్టుకున్నారు అంటూ కూడా ఓ సందర్భంలోఆయన గురించి కూడా కామెంట్ చేశారు. అయితే తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి కూడా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. షారుఖ్ ఖాన్ అంటే తనకు చాలా ఇష్టమంటూనే ఆయన గురించి వివేక్ అగ్నిహోత్రి కామెంట్స్ చేశారు.

షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల కారణంగానే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం నాశనం అవుతుందని ఈయన తెలియజేశారు. నాకు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం కానీ ఆయన చేసే రాజకీయాలు నచ్చవు అంటూ వివేక్ అగ్నిహోత్రి షారుక్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. షారుక్ ఖాన్ ఎంతో చరిష్మా ఉన్న నటుడు కానీఆయన వల్ల ఇండస్ట్రీ మొత్తం నాశనమైందని అందుకు నేను తనని బాధ్యున్ని చేస్తున్నానంటూ తెలిపారు.

షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నిమాలు ప్రజల సినిమాలు కాదని ప్రజలకు ఏమీ తెలియదని అతను భావిస్తారు అంటూ ఈయన తెలియజేశారు. ఆయన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ సినిమాలు తీశారు. కానీ నేను మాత్రం ప్రజల సినిమా చేస్తానని ఈయన తెలియజేశారు. ఇలా ప్రజల సినిమా షారుఖ్ ఖాన్ చేస్తానంటే తనతో సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus