Shah Rukh Khan: ‘పఠాన్‌’ కూడా తేడా కొడితే… బాలీవుడ్‌ పరిస్థితి అంతే!

  • June 25, 2022 / 09:54 PM IST

మొన్నటివరకు ‘బాలీవుడ్‌ సినిమానా.. అదో బ్రహ్మాండం’ అంటూ పొగిడిన మీడియా… ఇప్పుడు ‘బోడి బాలీవుడ్‌ సినిమా’ అంటూ ఏకి పారేస్తోంది. కారణం అక్కడ సరైన విజయాలు రాకపోవడం. దక్షిణాది నుండి రూపొందిన పాన్‌ ఇండియా సినిమాలు అక్కడ ఆడుతుండటంతో సౌత్‌ సత్తా చాలా ఎక్కువైంది అని అంటోంది. అంతేకాదు మన సినిమాల్ని వాళ్లు ఫాలో అవ్వాలని, అప్పుడే విజయం సాధిస్తాయి అని కూడా చెబుతోంది. మరి షారుఖ్‌ ఖాన్‌ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు.

షారుఖ్‌ ఖాన్‌ – కాంబినేషన్‌లో ‘జవాన్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నయనతార, ప్రియమణి కథానాయికలు. ఈ సినిమా పేరును ఇటీవల ప్రకటించారు. అందులో షారుఖ్‌ టీజింగ్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ రోజు ‘పఠాన్‌’గా షారుఖ్‌ కొత్త పోస్టర్‌ ఒకటి వచ్చింది. అందులో ఫుల్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. అందులో షారుఖ్‌.. అచ్చంగా సౌత్‌ హీరోను పోలి ఉన్నాడు. మరి షారుఖ్‌ సినిమాకు విజయం దక్కుతుందా అనేదే ప్రశ్న.

షారుఖ్‌ ఖాన్‌ గతంలో సౌత్‌ నేపథ్యమున్న సినిమా చేసి హిట్ కొట్టాడు. అదే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’. ఇప్పుడు అదే ఫీల్‌ కోసం ఏకంగా సౌత్‌ డైరక్టర్‌ను పెట్టుకుని సినిమా చేస్తున్నాడు. అంటే మొత్తంగా సౌత్‌ స్టైల్‌లోనే సినిమా చేస్తున్నాడు అని చెప్పొచ్చు. అలాగే ప్రభాస్‌ లాంటి సౌత్‌ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సిద్ధార్థ్‌ ఆనంద్‌తో సినిమా చేస్తున్నాడు. మరి సౌత్‌ స్టైల్‌ సినిమాలను అలవాటు పడి హిట్‌ చేస్తున్న అక్కడి ఆడియన్స్‌ షారుఖ్‌ సినిమాకు హిట్‌ ఇస్తారా అనేది చూడాలి.

వరుస పరాజయాలతో దిగాలుగా ఉన్న షారుఖ్‌ ఖాన్‌… కొత్త ఉత్సాహంతో కుర్ర దర్శకులతో సినిమా చేస్తున్నాడు. ‘జవాన్‌’, ‘పఠాన్‌’ అంటూ మాస్‌ సినిమాలతో వస్తున్నాడు. మరి సౌత్‌ సినిమాలకు మించిన విజయం వాటితో అందుకుంటాడా? అనేది చూడాలి. ఏమైనా ఆల్‌ ది బెస్ట్‌ బాద్‌షా. ఇండస్ట్రీలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus