సెప్టెంబర్ 9న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘బ్రహ్మాస్త్ర’ సినిమా. దీనికి డివైడ్ టాక్ వచ్చినా.. ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి. సినిమాలో గ్రాఫిక్స్, గ్రాండియర్ అన్నీ ఉన్నప్పటికీ ఎమోషన్స్, ఎలివేషన్ సీన్స్ లేకపోవడంతో అంత థ్రిల్లింగ్ గా అనిపించలేదని నెటిజన్లు అంటున్నారు. క్యామియో రోల్స్ కోసం స్టార్ హీరోలను రంగంలోకి దించడం సినీ ప్రియులను ఆకట్టుకుంది. నాగార్జున క్యారెక్టర్ గురించి ముందే రివీల్ చేశారు.
కానీ షారుఖ్ ఖాన్ గురించి మాత్రం చెప్పలేదు. అప్పటికీ షారుఖ్ ఉన్నట్లు వార్తలొచ్చినా.. థియేటర్లో ఆయన్ను చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. థియేటర్లో ఈ స్టార్ హీరోల ఎంట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దర్శకుడు అయాన్ ఈ పాత్రలను డిజైన్ చేసి తీరు మాత్రం నిరాశ కలిగించింది. వాటిని అర్ధాంతరంగా ముగించడం ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. షారుఖ్ ఖాన్, నాగార్జున లాంటి ఇమేజ్ ఉన్న స్టార్స్ ను తీసుకున్నప్పుడు వారికి తగ్గట్లుగా సన్నివేశాలు రాసుకోవాలి.
అసలే షారుఖ్ ని వెండితెరపై చూసి మూడేళ్లు దాటేసింది. రీసెంట్ గా ‘రాకెట్రీ’ సినిమాలో కనిపించారు కానీ అందులో ఆయనకు స్కోప్ లేదు. కానీ ‘బ్రహ్మాస్త్ర’ అలా కాదు. పూర్తిగా ఫాంటసీ ఫిల్మ్. షారుఖ్ కనిపించినంతసేపైనా సన్నివేశాలు బలంగా ఉండి ఉంటే బాగుండేది. కానీ అయాన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు.
రణబీర్ కపూర్, అలియాభట్ ల కెమిస్ట్రీ మీద పెట్టిన దృష్టి స్క్రిప్ట్ మీద పెట్టి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది. టాక్ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాకి కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా దూసుకుపోతుంది. వీకెండ్ లో గనుక భారీ కలెక్షన్స్ ను రాబడితే నిర్మాతలు సేఫ్ గా బయటపడతారు.