బిగ్ బాస్ హౌస్ లో మాయాస్త్రం టాస్క్ లో రణధీర గ్రూప్ విజేతలుగా నిలిచారు. ఇక్కడే బిగ్ బాస్ వారికి మాయాస్త్రం లోని భాగాలని సమానంగా పంచాడు. అయితే, ఆ తర్వాత సెకండ్ లెవల్లో మహాబలి టీమ్ మెంబర్స్ ని ఆ భాగాలని అదే గ్రూప్ లో వాళ్ల దగ్గర నుంచీ తీసుకుని అదే గ్రూప్ లో వేరేవాళ్లకి ఇవ్వాలని చెప్పాడు. దీంతో మహాబలి టీమ్ మాయాస్త్రాన్ని పంచడానికి ముప్పతిప్పలు పడింది. చివరగా షకీల, ఇంకా శివాజీ ఇద్దరూ కూడా 4 వారాల ఇమ్యూనిటీ రేస్ లో పడ్డారు.
వీరిద్దరి మద్యలోనే అసలు సిసలైన పోటీ జరగబోతోంది. అంతేకాదు, పవర్ అస్త్రాన్ని సాధించిన రెండో హౌస్ మేట్ కి ఈవారం ఎవిక్షన్ ఫ్రీ దొరకడమే కాకుండా 4 వారాల ఇమ్యూనిటీ కూడా లభిస్తుందని బిగ్ బాస్ చెప్పడంతో ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. శివాజీ రెండో వారం నామినేషన్స్ లో ఉన్నాడు. అలాగే, అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో రెండో పొజీషన్ లో ఉన్నాడు. కాబట్టి సేఫ్ గానే ఉన్నాడు.
ఇప్పుడు షకీల ఈ అస్త్రాన్ని సాధిస్తే రెండో కన్ఫార్మ్ హౌస్ మేట్ అవుతుంది. ఈ వారం సేఫ్ జోన్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు ప్రిన్స్ యావార్, రతిక, థామిని, శోభాశెట్టి వీళ్లందరూ కూడా డేంజర్ జోన్ లోకి వస్తారు. అందుకే, వీరిద్దరి మద్యలో పోరు ఆసక్తికరంగా మారింది. అందుకే, గేమ్ ఛేంజర్ గా రతిక మారాలని అనుకుంది. ఒకవేళ ఓటింగ్ లో వీక్ గా ఉన్న కంటెస్టెంట్ గా ఎవరికైనా ఎవిక్షన్ ఫ్రీ దొరికితే తను డేంజర్ జోన్ లో పడతానని గ్రహించింది.
రతిక ఎన్ని లాజిక్స్ వర్కౌట్ చేసినా లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వీక్ (Bigg Boss 7 Telugu) తన గ్రాఫ్ పడిపోయింది. దీనికి తను అనవసరంగా టీమ్ మెంబర్స్ ని తిట్టడమే కారణంగా మారింది. ఇక ఫైనల్ పోరులో శివాజీ వర్సెస్ షకీల ఇద్దరిలో పవర్ అస్త్రం ఎవరికి వచ్చిందనేది తెలియాలంటే ఒక్కరోజు ఆగాల్సిందే. అదీ మేటర్.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!