Shakeela: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా షకీలా… బయటపెట్టిన షాకింగ్ విషయాలు!

షకీలా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఎన్నో సినిమాలలో పలు బోల్డ్ క్యారెక్టర్లలో నటిస్తూ నటిగా గుర్తింపు పొందినటువంటి ఈమె కొన్ని కారణాల వల్ల అవకాశాలు కోల్పోయి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె ఇప్పటికే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు.ఇలా కొంతకాలం పాటు వెండితెరకు దూరమైనటువంటి షకీలా చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ కార్యక్రమంలో సందడి చేశారు.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో ఘనంగా ఆదివారం ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఆరవ కంటెస్టెంట్ గా షకీలా హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎన్నో సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్స్ చేసినటువంటి షకీలా (Shakeela) నిజజీవితంలో కూడా అలాగే ఉంటారనుకుంటే పొరపాటున తెలుస్తుంది.

ఈమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఎంతోమంది ట్రాన్స్ జెండర్లను ఆదరించి వారందరికీ అమ్మగా మారిపోయారు. తన వద్ద దాదాపు 50 మంది ట్రాన్స్ జెండర్లు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. వారందరూ తనని అమ్మ అని ఎంతో ప్రేమగా పిలుస్తారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలోకి షకీలా ఎంటర్ అవుతున్నటువంటి తరుణంలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు వేదిక పైకి వచ్చి షకీలా మంచితనం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈమె కూడా సినిమాలలో తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను తెలియజేశారు. తాను ఒక సినిమాలో నటిస్తే సెన్సార్ ఆ సినిమాను విడుదల చేయకుండా ఆపేసిందని దాంతో తనకు నాలుగేళ్ల పాటు సినిమా అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను అని తెలిపారు. ఇక సినిమాలలో సంపాదించినది మొత్తం తన అక్క చేతిలో పెడితే తనని దారుణంగా మోసం చేసింది అంటూ షకీలా ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus