సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ గతంలో ‘ప్రేమ కావాలి’ ‘లవ్ లీ’ వంటి సూపర్ హిట్లు చూసినవాడే. అయితే తర్వాత వరుస సినిమాలకి సైన్ చేయడం వల్ల..వాటి కథ,కథనాలపై అతను సరిగ్గా ఫోకస్ పెట్టలేదని.. అందుకే పరాజయాలు ఎదురయ్యాయని అంతా చెప్పుకున్నారు. అయితే ఆది మార్కెట్ కి తగ్గ బడ్జెట్లో సినిమాలు తీసి క్యాష్ చేసుకున్న నిర్మాతలు చాలా మంది ఉన్నారు.
ఆదికి ఇప్పటికీ మంచి నాన్ థియేట్రికల్ మార్కెట్ ఉంది అనేది వాస్తవం. అయితే ఈసారి ఆది మార్కెట్ కి మించిన బడ్జెట్ పెట్టి ‘శంబాల'(Shambhala) అనే సినిమాని తెరకెక్కించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ వంటివి ఈ సినిమాపై పాజిటివిటీ ఏర్పడేలా చేశాయి. తాజాగా ఈ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలకి చూపించారు మేకర్స్ అలాగే సాయి కుమార్. సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఇక వారి టాక్ ప్రకారం ‘శంబాల’ సినిమా 2 గంటల 24 నిమిషాల నిడివి కలిగి ఉందట. ‘శంబాల’ అనే ఒక ఊరు. అక్కడ ఉండే ఒక బండ.ఆ బండ కొన్ని సందర్భాల్లో ఆ ఊర్లో ఉన్న జనాలను బలి తీసుకోవడం. దీని వెనుక ఉన్న రహస్యం. దాన్ని ఛేదించడానికి ఆ ఊరికి వచ్చిన హీరో. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన సినిమా కథ అని చెబుతున్నారు. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుందట.
ఫస్ట్ హాఫ్ ని కూడా బాగా హ్యాండిల్ చేసినట్టు చెబుతున్నారు. సస్పెన్స్ తో నిండిన ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుందట. సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో వీ.ఎఫ్.ఎక్స్ వర్క్ బాగుంటుందట. క్లైమాక్స్ మాత్రం కొంతమంది ట్విస్టులు ముందుగా అంచనా వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ‘శంబాల’ సినిమా కొన్నేళ్ల నుండి వచ్చిన ఆది సినిమాల్లో చాలా బెటర్ అని అంటున్నారు.మరి ప్రీమియర్స్ టాక్, బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ వంటివి ఎలా ఉంటాయో చూడాలి.
