Shani: బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసిన షాని!

  • September 24, 2022 / 12:06 PM IST

బిగ్ బాస్ షో సీజన్6 కంటెస్టెంట్లలో ఒకరైన షాని బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాల పాటు ఉన్నా ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకోలేదు. బిగ్ బాస్ హౌస్ నుంచి షానిని ఎలిమినేట్ చేసిన సమయంలో ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే బిగ్ బాస్ షోకు వెళ్లి తప్పు చేశానని షాని కామెంట్లు చేయడం గమనార్హం. బిగ్ బాస్ నిర్వాహకులపై కూడా షాని షాకింగ్ కామెంట్లు చేశారు.

గతంలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ ఆఫర్ ను నేను వదులుకున్నానని షాని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షో నుంచి ఇంత తక్కువ సమయంలో నేను ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని షాని వెల్లడించడం గమనార్హం. తక్కువ సమయంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడం నాకు ఎంతగానో బాధ కలిగిస్తోందని షాని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నా నన్ను ఎలిమినేట్ చేయడం ఏంటని షాని ప్రశ్నించారు.

ఓటింగ్ కూడా తనకు అనుకూలంగా ఉన్నా నేను ఎలిమినేట్ అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు. తన ఎలిమినేషన్ వెనుక ఏదో కుట్ర జరిగిందని షాని పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. బిగ్ బాస్ హౌస్ లో చాలా విషయాలలో అడ్జస్ట్ కావాల్సి ఉంటుందని షాని వెల్లడించారు. బిగ్ బాస్ హౌస్ లో 20 మంది ఉంటారని కానీ వాళ్లకు కేవలం 5 బాత్ రూమ్ లు మాత్రమే ఉంటాయని షాని తెలిపారు.

షాని వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో గురించి గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు ఈ తరహా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో నిర్వాహకులు మాత్రం ఈ విమర్శల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు. బిగ్ బాస్ షో విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. బిగ్ బాస్ ఈ సీజన్ చాలా తక్కువ రేటింగ్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus