Shankar: శంకర్ ప్లానింగ్ మాములుగా లేదు!

స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం.. ఈ సినిమాలో ముప్పై నిమిషాల నిడివి ఉన్న ఓ పవర్ ఫుల్ పాత్ర ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో ఆ పాత్ర కోసం వివిధ భాషలకు చెందిన కొంతమంది స్టార్ హీరోలను తీసుకోవాలనుకుంటున్నారు. ఒక్కో భాష నుండి ఒక్క స్టార్ హీరోని తీసుకుంటే.. ప్రాజెక్ట్ కు పాన్ ఇండియా అప్పీల్ ఉంటుందని దర్శకనిర్మాతల ప్లాన్. హిందీలో ఈ స్పెషల్ రోల్ కోసం సల్మాన్ ఖాన్ ను అనుకుంటున్నారు.

చరణ్-సల్మాన్ ఖాన్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఆ దిశగా సల్మాన్ ను ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో ఈ రోల్ కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని అనుకుంటున్నారు. మెగా కాంపౌండ్ తో విజయ్ సేతుపతికి మంచి రిలేషన్ ఉంది. చిరు నటించిన ‘సైరా’ సినిమాలో విజయ్ సేతుపతి నటించాడు. అలానే వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’లో విలన్ గా కనిపించాడు. నీహారికతో తమిళంలో ఓ సినిమా చేశాడు. కాబట్టి తమిళ వెర్షన్ కి ఆయన్ని సంప్రదిస్తే కచ్చితంగా ఒప్పుకుంటారు.

ఇక కన్నడ వెర్షన్ కోసం సుదీప్, ఉపేంద్ర లలో ఒకరిని ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఇదంతా బాగానే ఉంది కానీ తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి ఇంకా ఎవరినీ ఫిక్స్ చేయలేదు.చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను తీసుకోవాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆలోచన మారింది. ఆ పాత్రను కూడా చరణ్ తోనే చేయించాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటే.. ఆ తరువాత మిగిలిన భాషల్లో నటీనటుల ఎంపిక పూర్తవుతుంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus