Shanmukh: షన్ను పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది.. వీల్ చైర్ కి పరిమితమైన షణ్ముఖ్!

షణ్ముఖ్ జస్వంత్ పరిచయం అవసరం లేని పేరు. యూట్యూబర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి షణ్ముఖ్ ఈ కార్యక్రమాల ద్వారా చాలా నెగెటివిటీని మూట కట్టుకొని బయటకు వచ్చారు. ఈ కార్యక్రమంలో సిరితో వ్యవహరించిన తీరు కారణంగా తన లవ్ బ్రేకప్ కూడా జరిగింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తి సునయన తనకు బ్రేకప్ చెప్పడంతో కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి

ఈయన ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండటమే కాకుండా వరుసగా కవర్ సాంగ్స్ వెబ్ సిరీస్ చేస్తూ ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే షణ్ముఖ్ తాజాగా వీల్ చైర్ లో కూర్చుని ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా షణ్ముఖ్ తన ఇంట్లో వీల్ చైర్ లో కూర్చుని ఉండడంతో అసలు ఈయనకు ఏం జరిగింది అంటూ పెద్ద ఎత్తున అభిమానులు కంగారు పడటమే కాకుండా.. ఏం జరిగింది మిస్టర్ షన్ను అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

అయితే ఈయన (Shanmukh) వీల్ చైర్ కు పరిమితం కావడానికి గల కారణాలను కూడా తెలియజేశారు. తనకు ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదని తెలియజేశారు. ఈ వీల్ చైర్ తన తాతయ్య కోసం తెచ్చినదని, అయితే తన తాతయ్య వీల్ చైర్ లో తాను సరదాగా కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా షణ్ముఖ్ తెలియజేయడంతో ఒక్క సారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం సరదాగా మాత్రమే కూర్చున్నారని తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరస్ గా మారింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus