Shanmukh: దీప్తితో విడిపోవడం గురించి స్పందించిన షణ్ముఖ్‌!

తెలుగు సోషల్‌ మీడియాలో స్టార్స్‌గా వెలుగొందారు షణ్ముఖ్‌, దీప్తి సునయన. కవర్‌ సాంగ్‌లు, వీడియో సాంగ్‌లు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే ఇదంతా షణ్ముఖ్‌… ‘బిగ్‌బాస్‌’కి వెళ్లనంతవరకే. వెళ్లాక కొద్ది రోజులు అంతా బాగానే ఉంది. కానీ అక్కడ షణ్ముఖ్‌, సిరి మధ్య అనుబంధం పెరిగేసరికి… బయట పరిస్థితులు మారిపోయాయి. బిగ్‌బాస్‌ హౌస్‌లో వారి మధ్య అనుబంధం ‘అతి’ అయ్యిందంటూ సిరి వాళ్ల అమ్మ అనేసరికి… పరిస్థితి మరీ మారిపోయింది. ఏకంగా షణ్ముఖ్‌ – దీప్తి బ్రేకప్‌ కూడా అయిపోయింది. ఈ బ్రేకప్‌పై షణ్ముఖ్‌ తాజాగా స్పందించాడు.

Click Here To Watch

దీప్తితో బ్రేకప్‌కి సిరి కారణం కాదు అని షణ్ముఖ్‌ మరోసారి తేల్చి చెప్పేశాడు. . సిరి ఎప్పటికీ తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని స్పష్టం చేశాడు. నిజానికి నేను బిగ్‌బాస్‌ లాంటి రియాల్టీ షోకి నేను సెట్‌ కాను. నేను చాలా మూడీ. ప్రేక్షకుల్లో గుర్తింపు కోసమే ఆ రియాల్టీ షోలో పాల్గొన్నాను. అక్కడ ఉన్నప్పుడు నా గురించి ప్రేక్షకులు పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారనుకున్నా. అయితే నాపై ఎంత నెగెటివిటీ వచ్చిందో బయటకు వచ్చాకే తెలిసింది అని చెప్పాడు షణ్ముఖ్‌. నా కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే ఈ విషయంలో నాకెలాంటి బాధ లేదు. ఎదురుదెబ్బల వల్ల జీవితంలో ముందుకు ఎలా సాగాలి అనేది నేర్చుకుంటున్నా అని చెప్పాడు షణ్ముఖ్‌.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు సిరితో చనువుగా ఉండటమే నాపై వ్యతిరేకత రావడానికి కారణం అనుకుంటున్నాను. అప్పటికే నేను దీప్తితో… సిరి శ్రీహాన్‌తో రిలేషన్‌లో ఉన్నాం. హౌస్‌లో ఉన్నప్పుడు నాకు, సిరికి చనువు పెరిగింది. మా కుటుంబసభ్యులు హౌస్‌లోకి వచ్చినప్పుడు… సిరి వాళ్లమ్మ ‘‘షణ్ముఖ్‌… నువ్వు ప్రతిసారి సిరిని హగ్‌ చేసుకోవడం నాకు నచ్చడం లేదు’’ అని అన్నారు. ఆమె మాటలకు నాకు చాలా బాధేసింది. హౌస్‌లో తనని ఎవరైనా ఏమైనా అంటే నేను సపోర్ట్‌ చేసేవాడిని.

కానీ సిరి వాళ్లమ్మ అవన్నీ వదిలేసి… నా గురించి తప్పుగా అనుకోవడంతో తట్టుకోలేకపోయాను అని అన్నాడు షణ్ముఖ్‌. నేనూ, దీప్తి విడిపోవడానికి ఇంకా చాలా కారణాలున్నాయి. నెటిజన్లు నన్ను ట్రోల్‌ చేస్తున్నప్పుడూ దీప్తి నాకే సపోర్ట్‌ చేసింది. సిరితో నేను చనువుగా ఉండటం దీప్తి కుటుంబానికి నచ్చలేదు. ఈ విషయంలో దీప్తిపై ఒత్తిడి పెరిగింది. తనైనా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రేకప్‌ చెప్పుకోవాల్సి వచ్చింది. మా బ్రేకప్‌కి సిరిని నిందించడం కరెక్ట్‌ కాదు. తప్పు నాదే కాబట్టి నన్నే అనాలి అంటూ షణ్ముఖ్‌ బాధపడ్డాడు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus