మొత్తానికి బిగ్ బాస్ 5వ సీజన్ కూడా మంచి రేటింగ్స్ తో ఈ సారి భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. నాగార్జున మూడోసారి కూడా పర్వాలేదు అనే విధంగా హోస్ట్ గా మంచి గుర్తింపును అందుకున్నారు. అయితే ఫైనల్ ఎపిసోడ్ మాత్రం కాస్త చప్పగా సాగింది అనే కామెంట్స్ అయితే గట్టిగానే వచ్చాయి. ఇక ఈ సారి ముఖ్య అతిథిగా ఎవరు లేకుండానే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ను పూర్తిచేశారు.
ఫైనల్ లో సన్నీ షణ్ముఖ్ టాప్ 2ల్ నిలువగా టైటిల్ ను సన్నీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే 4 వారాల క్రితం మాత్రం సన్నీ గెలుస్తాడు అని ఎవరూ అనుకోలేదు. తప్పకుండా ఈ సారి టైటిల్ విన్నర్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలుస్తారు అని అనుకున్నారు. కానీ అతనికి చివరలో అనుకున్నంతగా ఓట్లు పడలేదు. ఎక్కువగా సిరితో అతను కొనసాగించిన కెమిస్ట్రీ కారణంగా తీవ్రస్థాయిలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
ఆఖరికి సిరి తల్లి కూడా కూడా షణ్ముఖ్ జస్వంత్ ని లిమిట్స్ లో ఉండాలి అని చెప్పడంతో తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత కూడా మళ్లీ ఎప్పటిలానే షణ్ముఖ్ జస్వంత్ ఒక ప్రత్యేకమైన ట్రాక్ ను కొనసాగించడంతో అతనిపై నెగిటివ్ వైబ్రేషన్స్ మరింత ఎక్కువయ్యాయి. టైటిల్ విన్నర్ అయ్యే అర్హతను అప్పుడే కోల్పోయాడు అని అర్థమైంది. ఒక విధంగా తన ప్రత్యర్థి కి షన్ను పొరపాట్లతో అవకాశం ఇచ్చాడు అని చెప్పవచ్చు.
ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా షన్ను నిలువలేకపోయినప్పటికీ కూడా భారీగా ఆదాయం లభించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ లో 15 వారాల పాటు కొనసాగిన షన్నుకు పారితోషికం గట్టిగానే ముట్టచెప్పినట్లు సమాచారం. ఒక వారానికి అతనికి బిగ్ బాస్ నిర్వాహకులు 4 నుంచి 5 లక్షల మధ్యలో ఇచ్చినట్లు సమాచారం. అంటే మొత్తం 105 రోజుల కు గానీ గాను షణ్ముఖ్ జస్వంత్ కు 60 లక్షలకు పైగా పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!