Bigg Boss 5 Telugu: సూపర్ హీరోస్ టాస్క్ లో అన్ సీన్ లో ఏం జరిగింది..?

  • November 5, 2021 / 02:09 PM IST

బిగ్ బాస్ హౌస్ లో సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే టాస్క్ కంటిన్యూ అవుతోంది. ఇందులో భాగంగా షణ్ముక్ సిరికి పెద్ద మాటల యుద్ధమే జరిగింది. నిజానికి సిరి షణ్ముక్ కి ఆర్గ్యూమెంట్ జరిగిన రాత్రి జెస్సీ వచ్చి సిరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇక్కడే రవి కూడా సిరి షణ్ముక్ ల మద్యన ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. నీకు ఎక్కువ గిఫ్ట్స్ వచ్చాయి, తనకి రాలేదని రవి అభిప్రాయపడ్డాడు. ఇక్కడే షణ్ముక్ జెస్సీని మా టీమ్ లోకి వచ్చేయమని చెప్పాడు. రాత్రిపూట సిరిని బతిమిలాడి గుంజీళ్లు తీసి సారీ చెప్పాడు షణ్ముక్.

ఇక్కడే ఇద్దరూ గట్టిగా హగ్ చేస్కుని కలిసిపోయినట్లుగా కనిపించారు. కానీ, మార్నింగ్ రాగానే మళ్లీ ఆర్గ్యూమెంట్ అనేది షురూ అయ్యింది. బట్టలు విషయంలో ఇద్దరికీ మరోసారి గట్టి మాటల యుద్ధమే జరిగింది. ఇక్కేడ నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోంది అంటూ సిరికి వార్నింగ్ ఇచ్చాడు షణ్ముక్. దీంతో సిరి నాకు తగిలిన దెబ్బలకంటే కూడా నీ మాటలే చాలా హర్టింగ్ గా అనిపిస్తున్నాయి అంటూ బాధపడింది. నిజానికి అన్ సీన్ లో చూసినట్లయితే రవి కాజల్ బెడ్ దగ్గరకి వచ్చి అన్ని వస్తువులు పారేస్తుంటే కాజల్ వాటిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడే సిరి బట్టలు పారేస్తుంటే పింకీ వచ్చి సిరిని గట్టిగా తోసింది. దీంతో సిరి తలకి గట్టి దెబ్బతగిలింది.

అక్కడ్నుంచీ సిరి మీవాళ్లు తోశారు కదా మీరేమనరు అంటూ వెళ్లిపోయింది. ఇక్కడే షణ్ముక్ జెర్కిన్ ని సిరి వేస్కునే ప్రయత్నం చేస్తే షణ్ముక్ ఇంట్లో పంపించారు ఇది బాగోదు నాకు ఇచ్చేయ్ అంటూ మాట్లాడాడు. పింకీకి గట్టి క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు షణ్ముక్. ఇక్కడ షన్నూతో బాగా ఆర్గ్యూ చేసి పింకీ పైనల్ గా సిరికి సారీ చెప్పింది. సిరి ఎట్టకేలకి పింకీతో సారీ చెప్పించుకుంది. ఇక ఇదే విషయాన్ని పింకీ మానస్ తో చెప్పుకుని మరీ బాధపడింది. అన్ సీన్ లో జరిగిన ఈ ఇష్యూనే సిరి, షన్నూల మద్యలో యుద్ధానికి దారితీసింది. బట్టల విషయంలో సిరికి ఫుల్ క్లాస్ పీకాడు షణ్ముక్. అందరు ముందు తనని అలా అనడం సిరి జీర్ణించుకోలేకపోయింది. నీ మాటలు చాలా హర్టింగ్ గా ఉన్నాయంటూ బాధపడింది. అదీ విషయం

[yop_poll id=”5″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus