కబాలి తెలుగు రైట్స్ కోసం చాలామంది నిర్మాతలు ప్రయత్నించారు. నిర్మాణ రంగంలో అపారమైన అనుభవం, పంపిణీ వ్యవస్థపై పట్టున్నవాళ్లు ఉన్నారు. కోట్లు ధారబోయడానికి రెడీ అయ్యారు. ప్రముఖ నిర్మాతా దిల్ రాజు కూడా తెలుగు రైట్స్ కోసం ప్రయత్నించాడు. కానీ రేట్ ఎక్కువైందని వెనుకడుగు వేశాడు. వీరందిరి కాదని కబాలి రైట్స్ షణ్ముఖ పిక్చర్స్ అనే ఓ కొత్త సంస్థ దక్కించుకుంది. అయితే దీని వెనుక మోహన్ బాబు, అల్లు అరవింద్‌ల చాకచక్యం ఉందని తెలుస్తోంది. షణ్ముఖ పిక్చర్స్ సంస్థ అధినేతకు మోహన్ బాబుకు బాగా పరిచయం ఉంది.
అందుకే మోహన్ బాబు ,రజనీకాంత్ ద్వారా రికమెండ్ చేయించినట్లు తెలుస్తోంది. దాంతో పాటు అల్లు అరవింద్ కూడా కొంత పెట్టుబడి పెట్టి, తన వంతుగా గట్టి ప్రయత్నాలుచేయడంతో.. ఓ కొత్త సంస్థకు కబాలి రైట్స్‌దక్కాయి. ఈ విషయాలను స్వయంగా తెలుగులో కబాలి చిత్రాన్ని నిర్మిస్తోన్న నిర్మాతలే వెల్లడించారు. సినిమా హక్కులు కొత్త నిర్మాతలవే అయినా… వెనుకుండి అంతా నడిపిస్తోంది అల్లు అరవిందే అని.. మరోకరి పేరుతో ఆయన వ్యాపారంచేస్తున్నరన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్ వ్యాపార సూత్రాల గురించి కొత్తగా చెప్పేదేముంది..!