‘సింహాద్రి’ సినిమాలో ఎన్టీఆర్ పట్టుకునే గుండ్రపు కత్తి ఎంత ఫేమసో… ఆ కత్తిని అవసరమైన సమయంలో ఎన్టీఆర్‌కు అందించే నటుడూ అంతే ఫేమస్. ‘సింగమలై’ అంటూ ఓ అరుపు అరిచి ఎన్టీఆర్‌కు కత్తి అందించే ఆ నటుడు శరత్ సక్సేనా. అంతకుముందు ఆయన చాలా సినిమాలు చేసినా… రీసెంట్ టైమ్ ప్రేక్షకులకు మాత్రం ఆ సినిమానే. గత తరం అభిమానులకు గుర్తు చేయాలంటే ‘ముఠామేస్త్రీ’ గురించి చెప్పాల్సిందే. అందులో విలన్‌గా శరత్ సక్సేనా పాత్ర బాగా పండింది. ఒక్క బాలీవుడ్‌లోనే కాదు.. దేశంలోని దాదాపు అన్ని భాషల సినిమాల్లో నటించి, మెప్పించిన అనుభవం ఆయనకుంది.
అంత గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న శరత్ సక్సేనాలో నటుణ్ని గుర్తించడానికి దర్శక, నిర్మాతలకు 30 సంవత్సరాలు పట్టిందంట. ఈ విషయాన్ని శరత్ సక్సేనానే స్వయంగా చెప్పుకొచ్చారు. కెరీర్ తొలిరోజుల్లో అందరూ ఆయనను ఫైటర్‌గా, జూనియర్ ఆర్టిస్టుగా మాత్రమే చూసేవారట. ఆయన బాడీ కూడా ఒక కారణం అనుకోండి. ఆ రోజుల్లో అంత ఫిట్‌గా ఉండేవారు ఆయన. అప్పట్లో ఆయన తండ్రి అలహాబాద్ విశ్వవిద్యాలయం తరఫున క్రీడాకారుడిగా ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తితోనే శరత్ కూడా వర్కౌట్స్ చేయడం ప్రారంభించారట. అలా ఆ బాడీ వచ్చిందట.
శరత్ అవకాశాల కోసం ముంబై వచ్చినప్పుడు దర్శక, నిర్మాతలు అతని ప్రతిభను గుర్తించలేదట. విలన్ అనుచరుడు, ఫైటర్ పాత్రలు మాత్రమే ఇచ్చారట. 30 ఏళ్ల పాటు ఫైట్స్ చేస్తూనే ఉన్నారాయన. ఎంతో కష్టపడి డైలాగ్ కోసం దర్శక నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తే ‘యస్ బాస్, నో బాస్, వెరీ సారీ బాస్, క్షమించండి బాస్’ లాంటివి చిన్న మాటలు మాత్రమే ఇచ్చేవారట. ఆ సమయంలో షాహిద్ అలీ ‘సాథియా’లో హీరోయిన్ తండ్రిగా వేషం దక్కింది. అందులో నిడివి తక్కువే అయినా.. ప్రేక్షకులకు నచ్చేశారు. ఆ తర్వాత అవకాశాలు కూడా వచ్చాయి అని
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!