Sharwanand: 20 ఏళ్ల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న శర్వానంద్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని పలు సినిమాలలో హీరోగాను మరికొన్ని సినిమాలలో హీరో తమ్ముడి పాత్రలలోనూ నటిస్తూ మెప్పించినటువంటి వారిలో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. ఐదో తారీకు అనే సినిమా ద్వారా వెండి తెరపై సందడి చేసిన ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో హీరో తమ్ముడు పాత్రలలో నటించి మెప్పించారు. ఇలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శర్వానంద్ అనంతరం హీరోగా మారిపోయారు.

ఇలా శర్వానంద్ హీరోగా గమ్యం రన్ రాజా రన్, శతమానం భవతి వంటి సినిమాలు ఈయనకు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి.ఇక చివరిగా ఒకే ఒక జీవితం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు.ఇలా శర్వానంద్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా తన సినీ ప్రస్థానం గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా శర్వానంద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ 20 సంవత్సరాల సినీ కెరియర్లో వెండితెరపై ఎన్నో పాత్రలలో నటిస్తూ అందరిని అలరించాను. బావోద్వేగాలతో నిండిన ఈ ప్రయాణంలో 20 సంవత్సరాలు స్నేహం కష్టాలు ఎత్తులు లోతులు ఎన్నో అచంచలమైన ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచి నన్ను ముందుకు నడిపించిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని నా వ్యక్తిత్వాన్ని ఎంతో అందంగా మలిచాయి.

ఇక నా ఈ ఒకే ఒక జీవితం సినిమాకు అంకితం. 20 సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టిన ఈ సినీ ప్రస్థానం మరువలేనిది. ఈ సినీ ప్రపంచంలో నా గమ్యం ఎంతో దూరం. మిమ్మల్ని సందడి చేయడం కోసం ప్రతిక్షణం రన్ రాజా రన్ లా పరుగులు పెడుతూ ఉంటా మీరు అందించే శతమానం భవతి అనే ఆశీర్వాదాలతో సాధ్యమవుతుందని భావిస్తున్న అంటూ ఈ సందర్భంగా శర్వానంద్ తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకొని చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus