Sharwanand: శర్వానంద్ కొత్త సినిమా క్యాన్సిల్ అయిందా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చర్చల దశలోనే ఆగిపోతాయి. మరికొన్ని షూటింగ్ మొదలైన తరువాత ఆగిపోతుంటాయి. అయితే ఇప్పుడు శర్వానంద్ సినిమా ఒకటి కూడా డిస్కషన్ స్టేజ్ లోనే ఆగిపోయిందని తెలుస్తోంది. కొన్నేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తున్నారు శర్వానంద్. ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. అయితే హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు. అందుకే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా రిజల్ట్ తరువాత శర్వానంద్ బ్రేక్ తీసుకున్నారు. ఆ గ్యాప్ లో కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించారు.

ఇద్దరి మధ్య స్క్రిప్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ కూడా జరిగాయి. శర్వానంద్ కి కథ నచ్చింది కానీ కొన్ని మార్పులు చెప్పారు. ఇంతలోనే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందట. ఈ సినిమాకి బదులుగా దర్శకుడు కృష్ణచైతన్య సినిమాను మొదలుపెట్టారు శర్వానంద్. కొన్ని నెలల క్రితం నితిన్ తో ‘పవర్ పేట’ అనే సినిమా చేయడానికి రెడీ అయ్యారు కృష్ణచైతన్య. నితిన్ కూడా ‘పవర్ పేట’ గురించి మీడియాలో పలు సందర్భాల్లో చెప్పారు.

ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే అనుకోకుండా క్యాన్సిల్ అయింది. వెంటనే శర్వాకి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు కృష్ణచైతన్య. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. దీంతో శర్వానంద్-రాజు సుందరం కాంబినేషన్ లేనట్లే అని అర్ధమవుతుంది. చాలా ఏళ్లుగా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న రాజు సుందరం తమిళంలో దర్శకుడిగా అజిత్ తో ఓ సినిమా చేశారు.

కానీ ఆ సినిమా వర్కవుట్ కాలేదు. చాలా రోజులుగా తెలుగులో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో శర్వానంద్ ను సంప్రదించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా క్యాన్సిల్ అయింది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus