ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో విడుదలవుతున్న చాలా సినిమాలకు యునానిమస్ గా హిట్ టాక్ వస్తుంది. ‘బింబిసార’, ‘కార్తికేయ2’, ‘సీతారామం’ ఇలా చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మీడియాకి వేసిన ప్రీమియర్ షోల నుంచి.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బయటకొచ్చిన కామన్ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు.
సినిమా కథ, కథనాలతో పాటు శర్వానంద్ పెర్ఫార్మన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కి మదర్ సెంటిమెంట్ ని జోడించి.. ఫ్రెష్ ట్రీట్మెంట్ అందించిన దర్శకుడు శ్రీకార్తిక్ ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు సినీ అభిమానులు. నిజానికి ‘బ్రహ్మాస్త్ర’ సినిమా రిలీజ్ కావడంతో చాలా చోట్ల శర్వానంద్ సినిమాకి ఆక్యుపెన్సీ కనిపించలేదు. సోషల్ మీడియాలో పాజిటివ్ ట్వీట్స్ కనిపించడం, మౌత్ టాక్ బాగుండడంతో ఈవెనింగ్ షో నుంచి టికెట్స్ తెగడం మొదలైంది.
ఈ వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి వచ్చిన డివైడ్ టాక్.. ఈ సినిమాకి పాజిటివ్ అంశంగా మారుతుందేమో చూడాలి. చాలా కాలం తరువాత హిట్ రావడంతో శర్వానంద్ చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన నటించిన అరడజను సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.
మధ్యలో ‘శ్రీకారం’ సినిమా ఏవరేజ్ గా ఆడింది. ఈ ప్లాప్ ల కారణంగా శర్వా మార్కెట్ బాగా దెబ్బతింది. మొత్తానికి ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో సేవ్ అయిపోయారు శర్వానంద్. టాక్ అయితే బాగుంది మరి కమర్షియల్ గా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.