Sharwanand, Rashmika: ఆ టాలీవుడ్ హీరో రష్మికనే నమ్ముకున్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్న గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్నారు. పుష్ప ది రైజ్ సినిమాతో రష్మిక ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. పుష్ప ది రూల్ తో రష్మిక మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. రష్మిక నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుంది. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటించారు.

ఈ మధ్య కాలంలో హీరో శర్వానంద్ కు సరైన సక్సెస్ లేదు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో శర్వానంద్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. మరి గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న రష్మికతో కలిసి నటించిన శర్వానంద్ కు ఈ సినిమాతో సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు రష్మిక నటించిన ఛలో, భీష్మ సినిమాలు ఫిబ్రవరి నెలలోనే విడుదలై సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. రష్మిక సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని చెప్పవచ్చు.

మరి రష్మిక ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. రష్మిక కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. రష్మిక ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే రష్మిక రెమ్యునరేషన్ ను పెంచే ఛాన్స్ అయితే ఉంటుంది. సినిమాసినిమాకు రష్మికకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తే రష్మికకు క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రష్మిక కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు రష్మికకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రష్మిక బాలీవుడ్ లో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus