Sharwanand: వివాహ రిసెప్షన్ కు సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన శర్వానంద్!

టాలీవుడ్ కూల్ యాక్టర్ శర్వానంద్ జూన్ మూడవ తేదీ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేశారు. ఇలా వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక జైపూర్లో వివాహం చేసుకున్నటువంటి శర్వానంద్ నేడు సాయంత్రం హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ జరుపుకోబోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ వివాహ రిసెప్షన్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురు సినీ రాజకీయ ప్రముఖులను స్వయంగా శర్వానంద్ ఆహ్వానించారని తెలుస్తోంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈయన స్వయంగా కలవడమే కాకుండా తన వివాహ రిసెప్షన్ కి కూడా ఆహ్వానించారు. ఇక నేడు సాయంత్రం 7:30లకు హైదరాబాద్‍లోని ఎన్ కన్వెన్షన్‍లో శర్వానంద్, రక్షితా రెడ్డి వివాహ రిసెప్షన్ జరగబోతుంది.

ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో భాగంగా రాజకీయ నాయకులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.మరి సీఎం కేసీఆర్ ను ఆహ్వానించగా ఈయన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. శర్వానంద్ వివాహ వేడుకలలో భాగంగా హీరో రామ్ చరణ్, సిద్ధార్థ్ అదితి వంటి సెలబ్రిటీలు పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

అదేవిధంగా యు వి క్రియేషన్స్ వంశీ నిర్మాత దిల్ రాజు కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక నేడు సాయంత్రం జరగబోయే రిసెప్షన్ కి పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు హాజరుకానున్నట్టు తెలుస్తుంది. ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతుండగా పెళ్లి కోసం కొన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగుకు (Sharwanand) శర్వానంద్ బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus