శర్వానంద్ కి (Sharwanand) ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అతను యూత్- ఫుల్ సినిమాలు తీసినా అంతా కన్విన్స్ అవుతారు. కానీ యాక్షన్ ఇమేజ్ కోసం పరితపించిన ప్రతిసారి శర్వానంద్ కి ఎదురు దెబ్బలు తగిలాయి. ‘సత్య 2’ (Satya 2) ‘రాధా’ (Radha) ‘కో అంటే కోటి’ (Ko Antey Koti) ‘రణరంగం’ (Ranarangam) ఇలాంటి మాస్ అండ్ యాక్షన్ సినిమాలు చేసిన ప్రతిసారి శర్వానంద్ కి ప్లాపులే ఎదురయ్యాయి. అతన్ని ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ సైతం ఆ సినిమాలను రిజెక్ట్ చేశారు.
‘మనమే’ (Manamey) లాంటి క్లాస్ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద అలాంటివి కొద్దో గొప్పో వసూళ్లు రాబట్టాయి. అయినా సరే శర్వానంద్ మళ్ళీ ధైర్యం చేసి ఓ మాస్ అటెంప్ట్ చేయబోతున్నాడు. అదే ‘భోగి’ చిత్రం. మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi)… ఈ ‘భోగి’ ని తెరకెక్కించబోతున్నాడు. శర్వానంద్ కెరీర్లో 38వ సినిమాగా ‘భోగి’ (Bhogi) రూపొందుతుంది. ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై కె.కె.రాధా మోహన్ (K. K. Radhamohan) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
‘భోగి’ టైటిల్ కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే ఒక ఊరు. అక్కడ భయంకరమైన జనాలు. విపరీతమైన వయొలెన్స్. రక్తపాతం.. వంటి నేపథ్యం కనిపిస్తుంది. సంపత్ నంది దర్శకుడు కాబట్టి.. మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉంటాయి. కానీ ఈ రేంజ్ మాస్ కంటెంట్ కి శర్వా ఇమేజ్ సరిపోతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న? ఇక ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), డింపుల్ హయతి (Dimple Hayathi)..లు హీరోయిన్లుగా నటిస్తుండటం విశేషం.