‘ఓ స్టార్ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నారు, ఇది వారికి మొదటి సంతానం’ అంటూ నిన్నటి నుండి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో చాలా మంది నాగ చైతన్య (Naga Chaitanya) – శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) దంపతులు అని అనుకున్నారు. అక్కినేని అభిమానులు కూడా ఈ న్యూస్ ను తెగ వైరల్ చేశారు. కానీ 2 రోజుల క్రితమే నాగ చైతన్య- శోభిత కలిసున్న కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆదివారం రోజున వారు చేసిన ఫన్ యాక్టివిటీస్ ను తెలియజేస్తూ.. ఆ ఫోటోలు వదిలారు.
అందులో శోభిత నార్మల్ గానే కనిపించింది. కానీ ప్రెగ్నెంట్ మాదిరి ఎక్కడా కనిపించింది లేదు. అయినప్పటికీ వాళ్ళ పేర్లే ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. ఇంత ట్రెండ్ అయినా నాగ చైతన్య – శోభిత స్పందించి క్లారిటీ ఇచ్చింది లేదు. మరోపక్క ఆ స్టార్ కపుల్ వరుణ్ తేజ్ (Varun Tej) – లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు. కొన్నాళ్ల నుండి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో ఎటువంటి ఫోటోలు షేర్ చేయలేదు.
ఇది వరకు ఆమె తన భర్త వరుణ్ తేజ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన ఫోటోలు ఎక్కువగా షేర్ చేసేది. సో ఇప్పుడు టాపిక్ వరుణ్ – లావణ్య త్రిపాఠి..ల వైపు డైవర్ట్ అయ్యింది. కానీ ఈ జంట కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక వరుణ్ – లావణ్య త్రిపాఠి..ల వివాహం 2023 నవంబర్ 1న జరిగిన సంగతి తెలిసిందే.